సౌతిండియన్ సినిమాలు పాకిస్దాన్ లో రిలీజ్ అవ్వటం అరుదు. బాలీవుడ్ సినిమాలకు ఇచ్చిన ప్రయారిటీ దక్షిణాది సినిమాలకు ఉండదు. కానీ రోబో …దేశం మొత్తం ఎదురుచూస్తున్న సినిమా కావటంతో ..హిందీ వెర్షన్ ని పాకిస్దాన్ లోనూ రిలీజ్ చేసారు. అక్కడ కలెక్షన్స్ ,క్రేజ్ ట్రేడ్ వర్గాలు ఊహించని రీతిలో ఉండటం అందరికీ షాక్ ఇచ్చింది.
ముందుగా పాకిస్థాన్ లో 15 నుండి 20 థియేటర్లలో విడుదల చేశారు. అయితే అడ్వాన్స్ బుకింగ్ లోనే టికెట్స్ అన్నీ అమ్ముడయ్యాయి. సినిమాకు డిమాండ్ భారీగా ఉండడంతో పాకిస్థాన్ లో ఇప్పుడు స్క్రీన్ల సంఖ్యను 75కి పెంచారు. దీన్ని బట్టి పాకిస్థాన్ లో రజినీకాంత్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందంటూంటే..అదేమీ కాదు అక్షయ్ కుమార్ కు ఉన్న క్రేజ్ తో ప్రాజెక్టు ఆ రేంజికి వెళ్లింది అంటున్నారు. ఇక ఈ సినిమా వసూళ్ళ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది.
ప్రముఖ దర్శకుడు శంకర్ డైరక్షన్ లో రజనీకాంత్ హీరోగా రూపొందిన చిత్రం 2.o. లైకా సంస్థ సుమారు రూ.550 కోట్లతో రూపొందించింది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో భారీ అంచనాల మధ్య నవంబర్ 29న విడుదల అయ్యింది. ఈ సినిమాను 10 వేల స్క్రీన్ లలో విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్ల షేర్ వసూలు చేయగా, తమిళనాడులో ముప్పై కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిందని సమాచారం.