‘2.0’:కోర్టు ఇంజక్షన్ ఆర్డర్, ఆ వెబ్‌సైట్లకు దూల తీరినట్లే!

స్టార్ హీరోలు రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌ కలిసి నటించిన ‘2.0’. ఈ సినిమా ప్రతీ విషయంలో రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్‌కు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో నిర్మాతలు తమ సినిమా భాక్సాఫీస్ కలెక్షన్స్ పైధీమాగా ఉన్నారు. అదే సమయంలో ఈ సినిమా పైరసీ విషయమై తమిళ రాకర్స్ వార్నింగ్ కు భయం పట్టుకుంది. కానీ అక్కడ ఉన్నది లైకా టీమ్. వెంటనే మద్రాస్ హై కోర్ట్ కు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు.

మద్రాస్ హై కోర్టు వారు..ఈ సినిమా ని ఆన్ లైన్ బ్రాడ్ కాస్ట్ చేసేవారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామని అర్డర్ ఇచ్చిది. దాంతో ఇప్పుడు ఇంటర్నెట్ ప్రొవైడర్స్ వాళ్లు తమ సర్వీస్ ద్వారా ఈ సినిమా పైరసీ కాకుండా చూడాల్సిన భాధ్యత వారిదే. అటువంటి వెబ్ సైట్స్ ని వాళ్లే బ్లాక్ చేయాలి. నిర్మాతల అనుమతి లేనిదే ..2.0 సినిమా ఆన్ లైన్ లో కనపడటానికి వీళ్లేదు. దాంతో 12 వేల వెబ్ సైట్లకు ఎఫెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఏ వెబ్ సైట్ అయినా అత్యుత్సాహం చూపి ఈ సినిమాని ఆన్ లైన్ లో పెడితే వెంటనే ఇంటర్నెట్ ప్రొవైడర్ వాడు దాన్ని బ్లాక్ చేస్తారు. లేకపోతే వారి తలకు లీగల్ సమస్య చుట్టుకుంటుంది.

అలాగే 2.0 సినిమా థియేటర్లలో పైరసీ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు. దాదాపు పది మంది టీమ్ 2.0 సినిమాను పైరసీకి గురికాకుండా చర్యలు తీసుకుంటున్నారు. పైరసీని అడ్డుకునేందుకు చెన్నై, ఢిల్లీలో ప్రత్యేకంగా విభాగాలను ఏర్పాటు చేశారు. పైరసీ లింకులు కనిపిస్తే వెంటనే వాటిని బ్లాక్ చేస్తారు. థియేటర్లలో కొంత మంది సిబ్బందిని కూడా పెడుతున్నారు. తమ పరిధిలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొంటున్నాం అని లైకా ప్రొడక్షన్ వెల్లడించింది.

ఈ సినిమా మన దేశంలో 7,500 స్క్రీన్లలో విడుదల కాబోతోందట. ఉత్తర అమెరికాలో 850 స్క్రీన్లు, యూకేలో 300 స్క్రీన్లు, యూరప్‌లో 500 స్క్రీన్లు, దక్షిణ ఆసియాలో 100 స్క్రీన్లు, ఆసియా- పసిఫిక్‌లో 900 స్క్రీన్లు.. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10,500 స్క్రీన్లపై విడుదల కాబోతున్నట్లు సమాచారం.

అలాగే పాకిస్థాన్‌లోనూ ఈ సినిమా రిలీజ్ కు సీబీఎఫ్‌సీ అనుమతి ఇచ్చింది. అక్కడ దాదాపు 75 స్క్రీన్లలో చిత్రం విడుదల కాబోతోందట. అక్కడ కూడా అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభమైందని, అద్భుతమైన స్పందన లభించిందని చిత్ర యూనిట్ చెప్తోంది.

అలాగే ఈ సినిమా మార్నింగ్‌ షోను ఉదయం 4.30 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. తిరుచ్చిలోని వివిధ స్క్రీన్లలో ఉదయం 4.30 నుంచి 9 గంటలలోపు 20 కన్నా ఎక్కువ షోలను వేయాలని డిస్టిబ్యూటర్స్ భావిస్తున్నారట. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తారని, తిరుచ్చిలో 20 కన్నా ఎక్కువ మార్నింగ్‌ షోలకు సన్నాహాలు చేస్తున్నారని చెప్తున్నారు.

అంతేకాదు దుబాయ్‌లోని అతిపెద్ద మల్టీప్లెక్స్‌ VOX సినిమాస్‌లో ‘2.0’ను రోజుకు 100 షోల కంటే ఎక్కువ ప్రదర్శించడానికి డిస్టిబ్యూటర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఏ రేంజిలో సంచలనం సృష్టించబోతో అర్దం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.