‘2.0’ హిందీ వెర్షన్ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

సూపర్ స్టార్ రజినీ కాంత్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 2.0. ఈ సినిమా నిన్న విడుదలై బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. లింగ , కబాలి , కాలా చిత్రాలతో నిరాశ పరిచిన రజినీ మళ్ళీ ఈ చిత్రం తో ఫామ్ లోకి వచ్చారని అభిమానులు అంటున్నారు. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ నార్త్ లో రిలీజైంది. మొదటి రోజు హిందీ వెర్షన్ కు ఇరవై కోట్లు వచ్చాయి.

ఆ మొత్తం అద్బుతం కాదు కానీ…ఓ డబ్బింగ్ సినిమాకు మంచి ఓపినింగ్ అనే చెప్పాలి. అక్షయ్ కుమార్ నటించిన చిత్రం కావటంతో ఆ మాత్రం ఓపినింగ్స్ వచ్చాయి. అయితే రాజమౌళి చిత్రం బాహుబలికి మాత్రం 47 కోట్లు మొదట రోజు వచ్చాయి. సమ్మర్ సీజన్ కావటం, సినిమాపై ఉన్న హైప్ కలిసి వచ్చాయి. ఈ సినిమాకు అలాంటిదేమి లేకపోవటంతో ఇరవై కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పండుగ సమయంలో కాకుండా సాధారణ వీక్ డేస్ లో విడుదలైనప్పటికీ ‘2.0’ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. కర్ణాటకలో ఈ చిత్రం తొలిరోజు వసూళ్లు దాదాపు రూ.8.25 కోట్లు. హిందీ వెర్షన్‌లో ఈ చిత్రం దాదాపు రూ.25 కోట్లకుపైగానే వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు తెలిపారు.

ఈ చిత్రం మొదటి రోజు ఏపీ మరియు తెలంగాణ లో రూ. 12.43 కోట్ల షేర్ ను రాబట్టింది. లాంగ్ రన్ లో ఇదే ఫ్లో కొనసాగితే.. ఈ సినిమా మరిన్ని వసూళ్లు రాబట్టడం ఖాయం. ఇప్పటికే ఈ చిత్రం తమిళనాడులోని చెన్నై నగరంలో రూ.2.64 కోట్లు రాబట్టింది. ఇప్పటివరకు అక్కడ ఏ చిత్రం కూడా తొలిరోజు ఇంతటిస్థాయిలో వసూళ్లు రాబట్టలేదు.

విజయ్‌ నటించిన ‘సర్కార్’ విడుదలైన తొలిరోజు చెన్నై నగరంలో రూ.2.37 కోట్లు రాబట్టింది. పండుగ సమయంలో కాకుండా మామూలు రోజుల్లో విడుదలైనప్పటికీ ‘2.0’ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. కర్ణాటకలో ఈ చిత్రం తొలిరోజు వసూళ్లు దాదాపు రూ.8.25 కోట్లు. హిందీ వెర్షన్‌లో ఈ చిత్రం దాదాపు రూ.25 కోట్లకుపైగానే వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.