మహిళలు పని చే చోట వేధింపులపై “మీ టూ ” ఉద్యమం ప్రారంభమై ప్రకంపనలు సృష్టిస్తున్నది . తమని మానసికంగా హింసించి , సెక్స్ కోసం వత్తిడి తెచ్చే మగవాళ్ళను మహిళలు ఇప్పడు ధైర్యంగా బయట పెడుతున్నారు .సినిమా రంగంలో అయితే పెద్ద పెద్ద స్టార్స్ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. దీనిపై రోజుకొకరు తన గళం విప్పుతుందే , మరి కొందరు గతంలో జరిగిన చేదు అనుభవాలు చెబుతున్నారు . ముఖ్యంగా బాలీవుడ్లో ఎందరి పేరులో బయటికి వచ్చాయి . చేతన్ భగత్ , వికాస్ భా , గురిష్మాన్ ఖంబా , కైలాష్ ఖేర్ , రజత్ కపూర్ , ఆలోకనాథ్ ,
అను మాలిక్ ,సాజిద్ ఖాన్ వారి పేర్లు ఇప్పుడు బయటికి వచ్చాయి
ఇప్పుడు ఈ ఉద్యమం గురించి మలైకా అరోరా కూడా స్పందించింది . “మీ టూ ఉద్యమం మంచిదే . కానీ కేవలం ఇది మాట్లాడుకోవడాని మాత్రమే పరిమిత మవుతుందేమో అనిపిస్తుంది . దీని గురించి ఎక్కువ మాట్లాడుకునే కంటే అలాంటి ఘటనలు జరగకుండా మార్పు కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో అని ఆ అభిప్రాయం . పని చేస్తున్న చోట మహిళలు మానసిక వత్తిడి గిరి కాకూడదు . ఆహ్లాదకరంగా , ఆనందంగా ఎవరి పని
వారు చేసుకు పొతే బాగుంటుంది . మన మాట్లాడుకుంటున్నాము , మీ టూ .. ఉద్యమం మంచిదే . అయితే సినిమా పరిశ్రమలో మనం ఏమి మార్పు ఆశిస్తున్నామో అది రాత్రికి రాత్రే రాదనీ నా ఉద్దేశ్యం . ” అని చెప్పింది మలైకా .