మొదట్లో సల్మాన్ అంటే నాకూ ఇష్టం ఉండేది కాదు . ఒకసారి కులుమనాలి వెళ్ళేటప్పుడు రోడ్డు పక్క డాబా దగ్గర లంచ్ కోసం ఆగాం. ఆ హోటల్ నిండా సల్మాన్ ఫొటోలే ..ఓనర్ ఏమో బీజేపీ భక్తుడు ( పెద్ద నిలువు బొట్టు ) . పక్క హోటల్ కూడా అలానే ఉంది . దాని ఓనరేమో సర్ధార్ . వాళ్ళ ద్వారా మొట్టమొదటి సారి సల్మాన్ గురించి తెలుసుకున్నాను .ప్రతిసినిమాకు వచ్చే డబ్బుని తన అవసరాలు పోగా మిగిలిన మొత్తం పేదలకి పంచుతాడు అంట. అప్పులతో వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే ..సల్మాన్ వాళ్ళతో హోటల్స్ పెట్టించాడు. షూటింగ్ కి కులుమనాలి వచ్చినప్పుడల్లా వీళ్ళ దగ్గరకి వచ్చి వెళ్తాడట .ముంబయిలో తిరిగే ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబం సల్మాన్ దగ్గర ఏదో ఒక సహాయం పొందినదే . చాలా ఎమోషనల్ పర్సన్ .వాళ్ళ చెల్లి అర్పిత కూడా అనాథే . ఆమెని వాళ్ళింట్లో ఎలా చూసుకొంటారో చెప్పాల్సిన పనిలేదు
లాక్డౌన్ విధించిన దగ్గర నుంచి 25 వేల కుటుంబాలకి 6 వేల చొప్పున నగదు పంచారు సల్మాన్. ఇప్పుడు ఏకంగా లక్షా ఇరవై వేల కుటుంబాలకి నిత్యావసర సరుకులు ( 15 కోట్లు విలువ ) పంచుతూ మిగిలిన వాళ్లకి ఛాలెంజ్ చేసారని ఓ అభిమాని ఫేస్ బుక్ వేదికగా తెలిపాడు. మరి ఈ ఛాలెంజ్ ను స్వీకరించే దమ్ము టాలీవుడ్ అగ్ర హీరోలకి ఉందా? సల్మాన్ అంత సహాయం చేయలేకపోయినా 10వేల మందికైనా వ్యక్తిగతంగా సహాయం చేయగలరా? 15 కోట్లు విలువ చేసే నిత్యావసర సరుకులు పంచకపోయినా వ్యక్తిగతంగా 5 కోట్లు సరుకులు పంచే సత్తా ఉందా? అంత దయాగుణం మీ గుండెల్లో ఉందా? సల్మాన్ ఛాలెంజ్ ని స్వీకరించి ఎంత మంది రియల్ హీరోలు అనిపిస్తారో చూద్దాం. అయితే ఇప్పటికే సీసీసీ పేరిట కొంత విరాళం వచ్చింది.అంతో ఇంతో పంచారు. అయితే అటుపై టాలీవుడ్ హీరోలు సేవా కార్యక్రమాలు గాలికొదిలేసి ఇంట్లో కూర్చొని ఛాలెంజ్ లు విసరడం మొదలు పెట్టారు.
కొవిడ్ -19 వంటి విపత్కర సమయంలో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే? హీరోలంతా కలిసి ఇళ్లలో ఆడుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. దీంతో తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా ఆ హీరో అభిమానులే విమర్శించారు. ఇన్నాళ్లు మీలాంటి వాళ్లనా? ఆదరించాం అంటూ! మండిపడ్డారు. మేము టిక్కెట్ కొన్న డబ్బులతో మీరు ఎదిగారు…కోటీశ్వరులయ్యారు? అన్న విషయాలు విస్మరించారని ప్రతీ స్టార్ హీరో అభిమాని కలత చెందాడు. ఇప్పటికైనా మన హీరోలు పెళ్ళానికి కాఫీ చేశాను.. అమ్మకి దోసెలు వండాను.. కాళ్ళు పట్టాను .. లాంటి ఛాలెంజులు కాకుండా సమాజానికి ఉపయోగపడే సల్మాన్ లాంటి ఛాలెంజ్ లు చేయాలని అభిమానులు సూచించారు. చూద్దాం సల్మాన్ ఛాలెంజ్ ని ఎంత మంది స్వీకరిస్తారో!