AM Rathnam: నా సినిమాల్లో నటించిన తరువాతే వారు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏఎం రత్నం!

AM Rathnam: ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం గురించి మనందరికీ తెలిసిందే. ఆయన తెలుగుతో పాటు కోలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. మరి ముఖ్యంగా కోలీవుడ్ లో ఇండియన్, ఆరంభం, వేదాళం వంటి సూపర్ హిట్ సినిమాలను భారీ సినిమాలను నిర్మించారు. ఇకపోతే ఏఏం రత్నం తాజాగా నిర్మించిన సినిమా హరిహర వీరమల్లు. ఇందులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే.

అలాగే బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునిల్, కింగ్‌స్లీ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని, మనోజ్‌ పరమహంస చాయాగ్రహణం అందించారు. రవికృష్ణ, క్రిష్‌ జాగర్లమూడి దర్శత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో జూన్‌ 12న తెరపైకి రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి తారా తార అనే పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోనే ఒక స్టార్ హోటల్లో నిర్వహించారు మూవీ మేకర్స్. ఈ వేడుకలో దర్శకుడు కేఎస్ రవికుమార్, కె.ఆర్ పాల్గొని సినిమా మంచి విజయం సాధించాలి అంటూ శుభాకాంక్షలు కూడా తెలిపారు.

ఏఎం రత్నం మాట్లాడుతూ చిత్రం బాగా వచ్చిందని, హరిహర వీరమల్లు చిత్రానికి రెండవ భాగం చేస్తానని చెప్పారు. ఈ చిత్రానికి తన కొడుకు రవికృష్ణ దర్శకత్వం వహించడం సంతోషంగా ఉందని అన్నారు. కాగా తన చిత్రాల్లో నటించిన తరువాత ఆయా చిత్రాల కథానాయకులు రాజాకీయాల్లోకి ప్రవేశించారని ఆయన చెప్పారు. నటుడు శరత్‌కుమార్, విజయ్‌కాంత్, విజయ్, విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లారని, పవన్‌కల్యాణ్‌ ఉపముఖ్యమంత్రి అయ్యారని ఇది యాదృఛ్చకంగా జరిగిందో ఏమో తెలియదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రత్నం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.