పార్టీ రహిత ఎన్నికలకు చంద్రబాబు మేనిఫెస్టో.. నిమ్మగడ్డ నిద్రపోతున్నారా ?

Why Nimmgadda Ramesh Kumar silent over TDP manifesto 
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంటోంది.  ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు పైచేయి సాధించడం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు  చేస్తున్నారు.  అధికార పార్టీ ఏకగ్రీవాలు చేసే పనుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఏకంగా మేనిఫెస్టోనే రిలీజ్ చేశారు. అసలు పంచాయతీ ఎన్నికలంటేనే పార్టీ రహిత ఎన్నికలు. ఇందులో పార్టీలకు, పార్టీ గుర్తులకు చోటు ఉండదు. అభ్యర్థులు ఎవరికి వారు సొంతంగానే పోటీలో నిలబడాలి. పాలనలో అందరికీ ప్రాతినిథ్యం కల్పించాలనే ఉదేశ్యంతోనే ఎన్నికల సంఘం ఈ పద్దతిని పెట్టింది. అయితే పార్టీల రహితంగా ఎన్నికలు జరుగుతున్నాయా అంటే ముమ్మాటికీ లేదనే అనాలి. పంచాయతీ ఎన్నికల్లో అధికారికంగా పార్టీలు పాల్గొనకపోయినా వారి మద్దతుదారులే అభ్యర్థులుగా అంటారు. 
 
Why Nimmgadda Ramesh Kumar silent over TDP manifesto
ఎమ్మెల్యేలు తన పార్టీ వ్యక్తులను నిలబెట్టి అఫీషియల్ క్యాంపెనింగ్ చేయరు కానీ లోపాలు మాత్రం అంతా పార్టీల పేరు మీదనే నడుస్తుంది.  ఏపీలో ప్రజెంట్ పంచాయతీ ఎన్నికలు వైసీపీ వెర్సెస్ టీడీపీ అన్నట్టే నడుస్తాయి.  ఆ రెండు పార్టీల ప్రభావమే అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేస్తుంది.  ఇది సరైన పద్దతి కాకపోయినా జరిగేది ఇదే.  దీన్ని ఎవరూ ఆపలేరు.  వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో అభ్యర్థుల తరపున ప్రచారం చేయమని అంటున్నారే కానీ తమ మద్దతుదారులను గెలిపించుకునే ప్రయతనాలు అయితే మానుకోరు కదా.  అయితే ఇదంతా పైకి కనబడకుండా జరుగుతుంది.  ఎక్కడా పార్టీ ఇన్వాల్వ్ అయినట్టు అధికారిక చర్యలు, రుజువులు ఉండవు.  కానీ ఈసారి చంద్రబాబు నాయుడు మాత్రం ఒక అడుగు ముందుకేశారు. ఏకంగా పంచాయతీ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టోను రూపొందించారు. 
 
పల్లె ప్రగతి – పంచ సూత్రాల పేరుతో టీడీపీ మేనిఫెస్టోను రూపొందించారు.  అసలు పార్టీ రహిత ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను ప్రవేశపెట్టడం అనేది ఎలాంటి చర్య అనుకోవాలి.  కానీ బాబుగారు చేసేశారు.  అధికారికంగా లోకల్ బాడీ ఎన్నికలను తమ పార్టీ, తమ నాయకులు ప్రభావితం చేస్తారని మేనిఫెస్టోతో   చెప్పేశారు.  ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుంది.  ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి తప్పులను క్షమించేది లేదని ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటున్నారు.  వీలు చిక్కితే వైసీపీ నాయకులను తొక్కిపట్టేసేలా ఉన్నారు.  మరిప్పుడు చంద్రబాబు నాయుడు చేసింది కోడ్ ఉల్లంఘనే కదా.  మరి దీని మీద నిమ్మగడ్డ ఇంతవరకు చర్యలకు ఎందుకు పూనుకోలేదు.  అంటే టీడీపీ మేనిఫెస్టో తతంగం ఈసీ దృష్టికి ఇంకా వెళ్లలేదంటారా.