గోరంట్ల మాధవ్ ఇచ్చిన వార్నింగ్ టీడీపీకా లేకపోతే వైసీపీకా ?

YSRCP MP warning misfired 

వైసీపీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసుకుని హైప్ పొందాలని, ప్రతిపక్షాన్ని ఇరకారంలోపెట్టి అధినేత వైఎస్ జగన్ ముందు మంచి మార్కులు సంపాదించాలని ట్రై చేస్తుంటే ఒక ఎంపీ మాత్రం వీటన్నింటినీ భిన్నంగా వర్గాలు, కులాల మీద సంచలనం కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.  ఆయనే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.  ఆయన ఎంపీగా నెగ్గిన వైనమే బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది.  గత ఎన్నికల ముందువరకు  పోలీస్ శాఖలో పనిచేసిన ఆయన జేసీతో గొడవ కారణంగా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.  పోలీస్ శాఖ మీదే జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా  ఖండిస్తూ నాలుక కోస్తానని  వార్తల్లోకెక్కిన ఆయనకు జగన్ అనూహ్యరీతిలో హిందూపురం నుండి టికెట్ కేటాయించారు.  

YSRCP MP warning misfired 
YSRCP MP warning misfired

అంతకుముందు ఆయనకు రాజకీయాలతో పరిచయమే లేదు.  కానీ జేసీతో గొడవతో పాపులర్ కావడం, హిందూపురంలో ఆధిక సంఖ్యలో ఉన్న కురబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, జగన్ గాలి బలంగా వీయడంతో గత ఎన్నికల్లో తెలుగుదేశం సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్ప మీద గెలుపొందారు.  దాంతో ఆయన పాపులారిటీ మరింత పెరిగిపోయింది.  ఇలా కొన్ని నెలల వ్యవధిలోనే ఎంపీ  అయిపోయిన ఆయనకు దూకుడు రెట్టింపు అయింది.  పోలీస్ శాఖలో ఉండగా ఎలాంటి దూకుడును ప్రదర్శించారో రాజకీయాల్లో కూడ అదే తరహాలో ఉన్నారు.  రాజకీయం అంటేనే ఆచితూచి ఆలోచించి వ్యవహరించాలి.  ఆవేశం, అరుపులు కొన్ని సందర్భాల్లోనే పనిచేస్తాయి తప్ప చాలావరకు చేటు చేస్తాయి.  ప్రత్యర్థులే కాదు సొంత వ్యక్తులు కూడ రివర్స్ అవుతుంటారు.  

సరిగ్గా ఇదే జరుగుతోంది మాధవ్ విషయంలో.  ఎన్నికల వేళ వచ్చిన హైప్  సరిపోదనుకున్నారో ఏమో కానీ అప్పుడప్పుడు సంచలనంగా మాట్లాడుతూ వార్తలో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు.  ఎంపీ అయినా కొత్తల్లో కియా సంస్థ ప్రతినిధిపై  ఆయన వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది.  జగన్ సైతం ఈ విషయంలో సీరియస్ అయినట్టు వార్తలొచ్చాయి.  ఈమధ్య ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ దివంగత నేత, టీడీపీ మాజీ మంత్రి పరిటాల రవీంద్ర మీద రక్తచరిత్ర తరహా డైలాగ్స్ పేల్చారు.  ఎంతోమంది తలలు నరికి ఆ రక్తంతో ఎండిన పొలాలను తడిపారని పెద్ద దుమారమే లేపారు.  ఆతర్వాత పరిటాల కుటుంబం ప్రతివిమర్శలు చేయడంతో విషయం మరింత వేడెక్కింది.  

ఈ వివాదం సద్దుమణగకముందే తాజాగా రెడ్లు, కమ్మలకు ఓపెన్ వార్నింగ్ ఇచ్చేసి హాట్ టాపిక్ అయ్యారు.  మొన్న మాధవ్ సామాజికవర్గానికి చెందిన పెద్దలు వనభోజన కార్యక్రమాన్ని పెట్టుకున్నారు.  దానికి ముఖ్యఅతిధిగా వెళ్లిన మాధవ్ మైక్ పట్టుకోగానే పూనకం వచ్చినట్టు ఊగిపోయారు.  రెడ్లు, కమ్మలు కురబల మీద దౌర్జన్యం చేస్తే ఊరుకునేది లేదని, సీమ జిల్లాలో కురబల   ఇబ్బందులుపడుతున్నారని అన్నారు.  మీడియా ముందు కూడ కురబలకు అన్యాయం జరిగితే తాను అండగా ఉంటానని, కురబల బెదిరించేవారికి ఇదే హెచ్చరిక అని, కమ్మలు, రెడ్ల మీద చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. 

కురబల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండ మెండుగా ఉందని ఆయనే అంటున్నారు.  అందుకు నిదర్శనం కూడ ఆయన టికెట్ పొందడమే.  పైగా అధికారంలో ఉండేది వైసీపీనే.  ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఎంపీ సామాజికవర్గం మీద దాడులకు, బెదిరింపులకు పాల్పడతారని అనుకోగలమా.  లేదు కదా.  పైగా రెడ్లు, కమ్మలు అంటూ మాట్లాడిన మాధవ్ ఆ వాళ్ళు టీడీపీలు రెడ్లు, కమ్మలా లేకపోతే వైసీపీలో రెడ్లు, కమ్మలా అనేది మాత్రం చెప్పలేదు.  మరి ఆయన వార్నింగ్ ఎవరికిచ్చినట్టు.. మొత్తం సీమలో ఉన్న రెడ్లు, కమ్ములకు ఇచ్చేసినట్టే అనుకోవాలేమో.  ఆ లెక్కన చూసుకుంటే రెడ్డి నాయకులు వైసీపీలోనే కదా ఎక్కువగా ఉన్నారు మరి.