సైలెంట్ అయ్యాడనుకుంటే మళ్ళీ తడాఖా చూపించిన వైకాపా ఎమ్మెల్యే

YSRCP MLA fires in SP
ప్రజాప్రతినిధులకు, పోలీస్ అధికారులకు మధ్యన అప్పుడపుడు విభేదాలు రావడం సాధారణ విషయమే.  కానీ అవి ఈగో సమస్యగా మారితేనే ప్రమాదం.  ప్రస్తుతం నెల్లూరులో ఇలాంటి పరిస్థితే నెలకొంది.  కోవూరు వైకాపా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్  రెడ్డికి జిల్లా ఎస్పీకి మధ్యన మెల్లగా మొదలైన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.  గత ఏడాది కాలంగా వీరి నడుమ పొరపచ్చాలు నడుస్తూనే ఉన్నాయి.  లాక్ డౌన్ సమయంలో ఇవి మరింత ఎక్కువయ్యాయి.  లాక్ డౌన్ విధించినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి పోలీసుల అనుమతి లేకుండా ప్రజలకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని తలపెట్టారు.  రంజాన్ తోఫా పంపిణీ జరిపారు.  దాంతో జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
YSRCP MLA fires in SP
YSRCP MLA fires in SP
 
లాక్ డౌన్ సమయంలో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం ఏమిటని మండిపడుతూ ప్రసన్న కుకుమార్ రెడ్డితో పాటు కార్యక్రమానికి వెళ్లిన ఇంకొందరు అధికారులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  దీంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.  ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తే కేసులు పెడతారా, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటూ నేరుగా పోలీస్ స్టేషన్లోకి వెళ్లి సవాల్ చేశారు.  అప్పట్లో ఈ వివాదం పెద్ద దుమారాన్నే రేపింది.  మంత్రి పదవి దక్కలేదనే అసహనంలో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇదంతా చేస్తున్నారనే  ప్రచారం జరిగింది.  హైకమాండ్ నుండి కూడ అక్షింతలు పడ్డాయనే టాక్ ఉంది.  దీంతో ప్రసన్న కుమార్ రెడ్డి కొద్దిగా సైలెంట్ అయ్యారు. 
 
అయితే ఆ మౌనం ఎన్నో రోజులు నడవలేదు.  మళ్ళీ ఆయన ఎస్పీ మీద విరుచుకుపడ్డారు.  ఈసారి గతం కంటే మరింత ఘాటుగా హెచ్చరికలు ఇచ్చారు.  ఒక వివాదం విషయంలో తమ పార్టీ వారు చెబితే ఎస్సీ, ఎస్టీ కేసును నమోదుచేయలేదని ఎస్పీ మీద నిప్పులు చెరిగారు.  మేము చెబితే చేయరు, అదే టీడీపీ మాజీ మంత్రి చెబితే కేసు రాయకుండా ఆగిపోతారు.  ఎక్కడి నుండి వచ్చావ్.  రూల్స్ ఎవరు నేర్పారు నీకు.  ఎవరు కాపాడతారు నిన్ను.  ఇంకో రెండు మూడు నెలల్లో జిల్లా నుండి వెళ్ళిపోతావ్.  ఆ తర్వాత నీ బ్రతుకేంటి.  విజయవాడలో డీజీపీ నిన్ను కాపాడతాడని అనుకుంటున్నావా.  నా ఎస్సై, ఈ సీఐ పక్కన నేనుంటా.  ఏం చేస్తావో చూస్తా.  ఉన్న మూడు రోజుకు మంచి పేరు తెచ్చుకుని వెళ్ళు అంటూ హెచ్చరికల మీద హెచ్చరికలు చేశారు.