ఆ విషయంలో వైసీపీ ఫెయిల్ టీడీపీ సక్సెస్.. జగన్ మాట తప్పారుగా?

ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నా కొన్ని పథకాలు ప్రజల ఆదరణను పొందుతాయి. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయగా అన్న క్యాంటీన్ల వల్ల పేద ప్రజలకు ఎంతగానో మేలు జరిగింది. తక్కువ ఖర్చుతోనే టిఫిన్లు, భోజనం చేసే అవకాశం ఉండటంతో కూలి పని చేసుకుని బ్రతికే వాళ్లు, పేదవాళ్లు అన్న క్యాంటీన్లలో తినడానికి ఆసక్తి చూపేవారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అన్న క్యాంటీన్లకు పోటీగా పలువురు వైసీపీ నేతలు రాజన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సర్కార్ రాజన్న క్యాంటీన్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఏపీ ప్రభుత్వం ఇతర సంక్షేమ పథకాలపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో రాజన్న క్యాంటీన్ల దిశగా అడుగులు పడలేదు. రాజన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని పలువురు వైసీపీ నేతలు చెప్పినా వాళ్ల మాటల్లో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది.

అయితే జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోకపోయినా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు రాజన్న క్యాంటీన్ల దిశగా అడుగులు వేస్తున్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే త్వరలో రాజన్న క్యాంటీన్ ను ప్రారంభించబోతున్నారని సమాచారం. టీడీపీ నేతలు ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి ప్రజల ప్రశంసలను పొందుతున్నారు. అన్న క్యాంటీన్ల వల్ల టీడీపీ నేతలకు మంచి పేరు వస్తుండటంతో వైసీపీ నేతలు కూడా రాజన్న క్యాంటీన్ల దిశగా అడుగులు వేస్తున్నారు.

అయితే వైసీపీ నేతలు రాజన్న కాంటీన్లను ఏర్పాటు చేసినా టీడీపీకి వచ్చిన స్థాయిలో వైసీపీకి గుర్తింపు రావడం లేదు. జగన్ సర్కార్ అధికారికంగా రాజన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ రాజన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని వైసీపీ కార్యకర్తలు సైతం అనుకుంటున్నారు. మరి సీఎం జగన్ రాజన్న క్యాంటీన్ల దిశగా ఎందుకు అడుగులు వేయట్లేదో తెలియాల్సి ఉంది. రాజన్న క్యాంటీన్ల విషయంలో జగన్ మాట తప్పారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.