వైఎస్సార్ ఆరోగ్య ఆసరా స్కీమ్ గురించి తెలుసా.. నెలకు రూ.5 వేలు పొందే ఛాన్స్!

ఏపీ సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా స్కీమ్ కూడా ఒకటి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతో జగన్ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ ద్వారా జగన్ సర్కార్ నెలకు రూ.5 వేలు ఆర్థిక సహాయం అందిస్తోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ప్రజలకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ కలగనుంది.

 

ఈ కుటుంబాలకు చెందిన వాళ్లు శస్త్ర చికిత్సలు చేయించుకుని రెస్ట్ తీసుకునే సమయంలో ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య శ్రీ స్కీమ్ కింద శస్త్ర చికిత్సలు చేయించుకున్న వాళ్లు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 836 రకాల సర్జరీలకు జగన్ సర్కార్ ఈ బెనిఫిట్ ను అందిస్తోంది.

 

ఏపీలోని శాశ్వత నివాసితులు మాత్రమే ఈ స్కీమ్ బెనిఫిట్ పొందడానికి అర్హత కలిగి ఉంటారు. ఎస్సీ, ఓబీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్లకు ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందగలరు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఎంపిక చేసిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాళ్లు మాత్రమే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

 

ఆధార్ కార్డ్, రెసిడెన్స్ సర్టిఫికెట్, ట్రీట్ మెంట్ డాక్యుమెంట్స్, డిశ్చార్జ్ డాక్యుమెంట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్ కం సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇవ్వడం ద్వారా ఈ స్కీమ్ కు అర్హత పొందవచ్చు. పేద ప్రజలకు ఈ స్కీమ్ ద్వారా ఎంతగానో బెనిఫిట్ కలుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.