YS sharmila: నేను అలా మాట్లాడితే జగన్ అడుగు కూడా బయట పెట్టరు… షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS sharmila: ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల కూటమి ప్రభుత్వంపై కాకుండా వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తరచూ విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పటికి కూడా ఈమె తరచూ జగన్ మోహన్ రెడ్డి గురించి మీడియా సమావేశాలలో మాట్లాడుతూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వైసిపి అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో షర్మిల విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా ఉంటుందన్నట్లు ఉంది మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీరు. అందుకే నేను మాట్లాడేది వ్యక్తిగతం అనుకుంటున్నారు. వైకాపా పాలనలో ఐదేళ్లూ రాష్ట్రం మొత్తాన్ని దోచేశారు. ఋషికొండ లేకుండా చేసేసారు

కల్తీ మద్యం గురించి మీరు దోచుకున్న దోపిడీ గురించి,రూ.1,750 కోట్ల లంచాలు, వివేకా హత్య, గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా అదానీకి కారుచౌకగా విక్రయించడం, సోషల్‌ మీడియాలో సైతాన్‌ సైన్యం అరాచకాలపై మాట్లాడితే అవి వ్యక్తిగతం ఎలా అవుతాయో వైకాపా నాయకులే చెప్పాలి. నాకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత విభేదాలు ఉన్న నేపథ్యంలో తాను వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతానని కొంతమంది వైకాపా నాయకులు చెబుతున్నారు.

నేను వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అడుగు కూడా బయట పెట్టలేదని ఈమె తెలియజేశారు.సెకి ఒప్పందంలో జగన్‌ అవినీతిపై అన్ని ఆధారాలూ దగ్గర పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోంది? జగన్‌ ప్రభుత్వంలో కాకినాడ పోర్టునే కాదు.. కృష్ణపట్నం పోర్టునూ బలవంతంగా రాయించుకున్నారు. గంగవరం పోర్టును కూడా అమ్మేశారు వీటిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈమె ప్రభుత్వాన్ని కోరారు.జగన్‌ రూ.1,750 కోట్ల లంచాలు తీసుకున్నారని అమెరికా కోర్టులో కేసు నమోదైంది. ఇంత జరిగినా కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తుందో నాకు అర్థం కావటం లేదంటూ షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.