హాట్ టాపిక్… జగన్ గెలుపుపై హస్తినకు షర్మిళ నివేదిక!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఏపీలో వైసీపీ వర్సెస్ కూటమి రాజకీయం ఒకెత్తుగా నడిస్తే… వైసీపీ వర్సెస్ షర్మిళ రాజకీయ మరొకెత్తు అన్నట్లుగా సాగింది. పీసీసీ చీఫ్ గా షర్మిళ బాధ్యతలు తీసుకున్నది మొదలు.. టార్గెట్ వైఎస్ జగన్ అనే ఆపరేషన్ పైనే పూర్తి దృష్టి సారించారు!

ఇందులో భాగంగా మిగిలిన ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లినప్పుడు.. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో జగన్ ఫెయిల్ అయ్యారని పొరచారం చేసిన షర్మిళ… కడప జిల్లాకు వచ్చేసారికి వైఎస్ వివేకా హత్య కేసును అడ్డుపెట్టి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కొన్ని సందర్భాల్లో ఈ విమర్శలు శృతిమించిపోవడంతో కోర్టు.. వివేకా హత్య కేసు టాపిక్ ఎత్తొద్దని చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇక కడప ఎంపీగా షర్మిళ పోటీ చేశారు. ఈ సమయంలో ఆమె గెలుపుపై భిన్నాభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి. షర్మిళ గెలుపుపై అంచనాలు పాజిటివ్ గా వస్తున్నట్లు కనిపించడం లేదని అంటున్నారు. మరోపక్క ఏపీలో మళ్లీ జగనే అనే చర్చ బలంగా మొదలైందని చెబుతున్నారు. పైగా… విదేశీ పర్యటనకు ముందు మాట్లాడిన జగన్… 2019 కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మరోపక్క జూన్ 9న విశాఖలో ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ముహూర్తం కూడా ఫిక్స్ చేసి, ఆ దిశగా కార్యక్రమాలు చేస్తున్నారని అంటున్నారు. మరోపక్క వైసీపీ గెలుపు పక్కా అని నమ్ముతూ… విశాఖలోని పలు హోటల్లలో ఆ రోజుకు గదులన్నీ అడ్వాన్స్ బుక్కింగ్ చేసేశారని చెబుతున్నారు.

ఆ సంగతి అలా ఉంటే… ఈసారి జాతీయ స్థాయిలో ఎన్ డీయే కూటమికి కానీ, ఇండియా కూటమికి కానీ భారీ మెజారిటీ రాదని, ఈ సమయంలో ఏ కూటమికీ చెందని పార్టీలకు వచ్చే ఎంపీ స్థానాలు ఈసారి కేంద్రంలో కీలక భూమిక పోషించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ సమయంలో షర్మిళ నుంచి ఏపీకి సంబంధించిన నివేదిక తెప్పించుకుందంట కాంగ్రెస్ హై కమాండ్!

ఈ నేపథ్యంలో… ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని.. కేంద్రంలో కీలక భూమిక పోషించే స్థాయిలో వైసీపీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని.. ఇదే సమయంలో ఈసారి అటు ఎన్డీయేకి కానీ, ఇటు ఇండియా కూటమికి కానీ నేరుగా మద్దతు ఇచ్చే అవకాశం లేదని.. ఈ విషయంలో జగన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని షర్మిళ నివేదిక ఇచ్చారని మీడియాలో కథనాలు హల్ చల్ చేస్తున్నాయి.

ఈ సమయంలో ఏపీలో షర్మిళ నివేదిక ఇచ్చే విషయంలో.. కాంగ్రెస్ హై కమాండ్ కు ఏపీలో అత్యంత విశ్వాసపాత్రుడైన ఒక సీనియర్ నేత అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని పంపారని.. జగన్ గెలుపు ఆల్ మోస్ట్ కన్ ఫాం అని.. అయితే.. కేంద్రంలో మద్దతు ఇచ్చే విషయంలో జగన్ చాలా వ్యూహాత్మకంగా పావులు కదపబోతున్నారని హై కమాండ్ కు తెలిపారని తెలుస్తుంది.