YS sharmila: వైయస్ షర్మిలకు చెక్ పెట్టే ఆలోచనలో కాంగ్రెస్ హై కమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. షర్మిల వ్యవహార శైలిపై ఏపీలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈమె కూటమి నేతలను ప్రశ్నించడం మానేసి వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చారు. సమయం దొరికిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గురించి ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయనపై విమర్శలు కురిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే షర్మిల వ్యవహార శైలిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమవుతుంది. ఈ విషయంపై షర్మిల మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయవచ్చు అలా చేయటానికి ఇదే మంచి సమయం కాని ఆమె మాత్రం కూటమి నేతలను ప్రశ్నించకుండా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు జగన్ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే రావడంతో ఎంతోమంది సీనియర్ నేతలు పార్టీలు మారుతున్నారు. ఇలాంటి సమయంలో ఈమె వైకాపా నాయకులను తన పార్టీలోకి ఆహ్వానించడానికి సరైన సమయం అయినప్పటికీ వీటిపై దృష్టి సారించకుండా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నారు. ఇదే విషయంపై కొంతమంది సీనియర్ నేతలు షర్మిల పట్ల హై కమాండ్ కు ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది.
షర్మిల తన సొంత పార్టీ నేతలను సమన్వయం చేసుకోవటం లేదంటూ ఢిల్లీకి ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ లో కొత్త చర్చకు కారణమవుతున్నాయి. షర్మిల జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారని ఈమె పట్ల ఫిర్యాదులు వచ్చాయి. మరి ఇలాంటి ఫిర్యాదుల నడుమ కాంగ్రెస్ హై కమాండ్ షర్మిల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది.