వైఎస్ జగన్ డబుల్ ధమాకా.! ఇదేం ట్విస్ట్ మహాప్రభో.!

మీకు తెలుసా.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ లోక్ సభకు పోటీ చేస్తారట.! కాదు కాదు, పులివెందులతోపాటు, ఇంకో అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పోటీ చేస్తారట.! మొత్తంగా వైఎస్ జగన్ రెండు చోట్ల పోటీ చేయడం ఖాయం.!

ఏపీ రాజకీయాల్లో ఆఫ్ ది రికార్డుగా ఈ ప్రచారం గట్టిగానే సాగుతోంది. అది కూడా వైసీపీ శ్రేణుల నుంచే. రెండు కాదు.. మూడు.! ఎందుకంటే, మూడు రాజధానులు కాబట్టి.. అన్నది సోకాల్డ్ మేధావుల ఉవాచ.

పులివెందుల కాదని, ఇంకో నియోకవర్గం నుంచీ.. అందునా, కడప కాకుండా మరో జిల్లా నుంచి వైఎస్ జగన్, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే లేదు. మరి, పుకార్లు ఎలా వస్తున్నాయ్.? వస్తాయ్.. రాజకీయాలంటేనే అంత.!

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీయార్, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు కదా.? అద్గదీ అసలు సంగతి.! కేసీయార్ బాటలో వైఎస్ జగన్.. అన్న ప్రచారం అలా పుట్టుకొచ్చిందన్నమాట.

‘వై నాట్.?’ అన్న చర్చ వైసీపీ వర్గాల్లో జరగడంలో వింతేమీ లేదు వైఎస్ జగన్ రెండు చోట్ల పోటీ విషయమై. మూడు రాజధానుల వ్యవహారంలో, విపక్షాలకు షాక్ ఇవ్వడానికి వైఎస్ జగన్, రాయలసీమ కాకుండా, మిగతా రెండు ప్రాంతాల నుంచి పోటీ చేస్తే బెటరన్నది ఓ వాదన.

రాయలసీమ ఎలాగూ వైసీపీకి కంచుకోటే కదా.! విశాఖలో పోటీ చేస్తారా.? గుంటూరు లేదా విజయవాడ నుంచి వైఎస్ జగన్ పోటీ చేస్తారా.? ఇలాంటి ఊహాగానాలు, చర్చోపచర్చలు మామూలే.