2019 ఎన్నికలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వైసీపీ సాధించిన విజయాన్ని టీడీపీ నాయకులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. జగన్ వేసిన వ్యూహాలు నుండి ఇంకా టీడీపీ నాయకులు బయపడలేకపోతున్నారు. వైసీపీ విజయన్నాయితే సాధించింది కానీ పాలన విషయంలో మాత్రం చాలా అనుభవ రాహిత్యం కనిపిస్తుంది. దాదాపు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలు కోర్ట్ ల చుట్టే తిరుగుటున్నాయి. ఇప్పటికే దాదాపు 100సార్లు కోర్ట్ ల దగ్గర నుండి వైసీపీ ప్రభుత్వం చివాట్లు తిన్నది.
జగన్ పాలనలో అనుభవ లేమి కనిపిస్తుందా?
అఖండ విజయంతో ముఖ్యమంత్రి సింహాసనాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధిరోహించాడు. అయితే ఆయన పాలనలో అడుగడుగున అనుభవ లోపం కనిపిస్తుంది. ఈ అనుభవ లోపాన్ని టీడీపి నేతలు బాగా వాడుకుంటున్నారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రతి దశలోనూ అడ్డుకుంటున్నారు, ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వంతో ఆడుకుంటున్నారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని టీడీపీ నేతలు కోర్ట్ ల్లో అడ్డుకుంటున్నారు. జగన్ పాలనలో ఉన్న అనుభవ లోపాన్ని టీడీపీ నేతలు బాగా వాడుకుంటున్నారు. వైసీపీ పాలనలో అనుభవ రాహిత్యానికి నిదర్శనం ఏంటంటే ఒక్కోసారి వైసీపీ న్యాయవాదులు కోర్ట్ ల్లో సరిగ్గా పిటిషన్ ను కూడా దాఖలు చేయలేకపోతున్నారు.
వైసీపీ మంత్రులు బాబుకు మద్దతు తెలిపుతున్నారా?
ఇటీవల మంత్రివర్గ సమావేశం హాట్ హాట్ గా సాగిందట. మంత్రివర్గంలో జరిగినవి మీడియాకు చెప్పకముందే టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇస్తే సహించేది లేదని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రులపై ఫైర్ అయినట్టు ప్రచారం సాగుతోంది. వైసీపీ మంత్రి వర్గంలో ఉంటూ చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వ్యవహరిస్తే సహించేది లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారని సమాచారం. సీఎంకు అనుమానం ఉన్న ఇద్దరు మంత్రులకు ఇన్ డైరెక్ట్ గా ఇలా హెచ్చరిక ఇచ్చాడని.. ఇలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గట్టిగానే క్లాస్ పీకాడని అంటున్నారు. మరి ఈ క్లాస్ తోనైనా మంత్రుల్లో మార్పు వస్తుందా? లీకులు ఆగుతాయా అన్నవి చూడాలి.