YS Jagan: వైకాపా అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో అక్రమ ఆస్తుల కేసుల విషయంలో అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం బెయిల్ మీద ఈయన బయట ఉన్నారు ఇకపోతే తాజాగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు జగన్ ఆస్తుల కేసు గురించి కోర్టులో పిటిషన్ వేసిన విషయం మనకు తెలిసిందే.
జగన్ ఆస్తుల కేసు విచారణ ఆలస్యం అవుతోందని.. కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని గతంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఈ పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విచారణ చేయగా.. రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయని ఇరుపక్షాల లాయర్లు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లు కోర్టుకు తెలిపారు.
ఇలా జగన్ ఆస్తులు విచారణ కేసు ఎందుకు ఆలస్యం అవుతుంది అంటూ న్యాయస్థానం ప్రశ్నించడంతో లాయర్లు ఈ ప్రశ్నకు సమాధానంగా డిశ్చార్జ్, వాయిదా పిటిషన్లు, ఉన్నత కోర్టుల్లో విచారణ పెండింగే కారణమని లాయర్లు కోర్టుకు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న అంశాల కారణమని తెలియజేశాయి. ఈ క్రమంలోనే జగన్ ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది. ఈ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు రెండు వారాల్లోగా అందించాలని.. డెడ్ లైన్ ప్రకటించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, ట్రయల్ కోర్టు, పెండింగ్ కేసుల వివరాలు ఇవ్వాలని ఈ మేరకు సుప్రీం కోర్టు ఆదేశించింది.