YS Jagan: ఒకసారి ఎవరైనా అధికారంలోకి వస్తే మన చుట్టూ ఎన్నో జరుగుతున్న అవి మనకు పెద్దగా కనిపించవు కానీ అధికారం లేనప్పుడే ఎంతో కష్టతరం అవుతుంది అలాంటి కష్టాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది కీలక నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లిన పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి.
ఈ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారం కోసం తాపత్రయ పడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం నిర్వహించబోయే జమిలి ఎన్నికలకు ఈయన కూడా మద్దతు తెలిపారని తెలుస్తుంది. జమిలి ఎన్నికలు కనక నిర్వహిస్తే 2027 వ సంవత్సరంలోనే ఈ ఎన్నికలు వస్తాయి తద్వారా ఈయన తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధికారంలోకి రావాలి అంటే ముందు ప్రజలలో తమ పార్టీని పూర్తిగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది.
గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన కూడా కొంతమంది కీలక నేతలను అలాగే కార్యకర్తలను పెద్దగా పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యేల కంటే కూడా వాలంటీర్లకే ప్రాధాన్యత ఇచ్చారనే వాదన ఉంది. అందుకే సంక్రాంతి తర్వాత ఈయన జనంలోకి రాబోతున్నారని పక్కా పథకం ప్రకారమే జగన్ ముందడుగులు వేస్తున్నారని తెలుస్తుంది.
జమిలి ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డికి అధికారం రావడం ఎంతో గగనం అందుకే ఇప్పటినుంచే ఈయన ప్రజలలో తిరుగుతూ ప్రజలలో తానే ఒకడిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట అందుకే ఇలా సంక్రాంతి తర్వాత జిల్లాల వ్యాప్తంగా పర్యటనలు మొదలు పెట్టారని తెలుస్తుంది. అంతలోపు కోర్ట్ ఈయనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇస్తే తిరిగి అసెంబ్లీలోకి వెళ్తారు లేదంటే ఇలా ప్రజలలోనే పర్యటనలు చేస్తూ ఉంటారని తెలుస్తుంది. ఏది ఏమైనా ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జగన్ ఇలాంటి పథకం రచించారని చెప్పాలి.