పవన్ కళ్యాణ్‌పై పోటీకి అభ్యర్థిని ఖరారు చేసిన వైఎస్ జగన్.?

2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకటేమో గాజువాక నియోజకవర్గం కాగా, ఇంకోటి భీమవరం నియోజకవర్గం. ఉత్తరాంధ్రలో జనసేనకు మంచి పట్టు వుందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ ఉత్తరాంధ్రలో పవన్ ఓడిపోయారు. సేమ్ టు సేమ్ ఉభయ గోదావరి జిల్లాల్లోనూ జనసేన స్ట్రాంగ్‌గా వుందనుకుంటే.. అక్కడా పవన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

అందుకే, 2024 ఎన్నికల విషయమై జనసేన అధినేత వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. భీమవరంపై జనసేనాని పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. గాజువాక విషయంలో మాత్రం కొంత ఆసక్తితోనే వున్నారట. గాజువాక కాకపోతే ఎక్కడ.? అన్నదానిపై జనసేనాని మల్లగుల్లాలు పడుతున్నారు.

జనసేన అధినేత ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయన్ని ఓడించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర ఖచ్చితమైన వ్యూహాలున్నాయి. ‘ఎట్టిపరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గెలవకూడదు.. గెలిస్తే, జనసేన బలపడే అవకాశాలుంటాయ్.. టీడీపీ ఎలాగూ గల్లంతైపోయింది.. మనకు ప్రత్యర్థి వుండకూడదు..’ అని వైసీపీ అధినేత, పార్టీ ముఖ్య నేతలతో పదే పదే చెబుతున్నారు.

‘వై నాట్ 175’ ఉద్దేశ్యం ఇదే. కాగా, జనసేన అధినేతను ఓడించే అభ్యర్థిని వైఎస్ జగన్ ఇప్పటికే ఖరారు చేశారట. ఆ వ్యక్తి సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి అట. అయితే అలీ మాత్రం కాదంటున్నారు. అభ్యర్థి ఎవరన్నది ఇప్పుడే రివీల్ చేరట. పవన్ తాను పోటీ చేయబోయే నియోజకవర్గం గురించి ఏమాత్రం హింట్ ఇచ్చినా, ఆ వెంటనే వైఎస్ జగన్ తమ అభ్యర్థిని రంగంలోకి దించుతారట.