వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల్లో మూడు రాజధానుల అంశం. ఈ విషయంలో ఇప్పటికే అనేక విమర్శలను వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల కోసం ఎన్ని సంక్షేమ పథకలను ప్రవేశపెడుతున్నారు కానీ అమరావతి రైతుల పట్ల జగన్ వైఖరిని ప్రతి ఒక్కరినీ తప్పు పడుతున్నారు. అధికారంలోకి వస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను మళ్ళీ అందిస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ ఇలా అమరావతి రైతుల పట్ల రాజకీయ ధోరణితో వ్యవహరించడం తగదని మేధావులు కూడా వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే ప్రతిపక్షాలైన టీడీపీ, బీజేపీ నాయకులు కూడా రైతులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంపేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఇలా విమర్శలు చేస్తూ తనను రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న వారికి జగన్ త్వరలో షాక్ ఇవ్వనున్నారని రాజకీయ పండితులు చెప్తున్నారు.
అమరావతి రైతులతో చర్చలకు జగన్ సిద్ధమా!
అమరావతి రైతులను పట్టించుకోవడం లేదని ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేయడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి రైతులతో చర్చలకు కూడా సిద్ధమయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కొడాలి నాని లాంటి వైసీపీ నాయకులు శాసన రాజధాని కూడా ఇక్కడ ఉండదని రైతులను భయపెట్టడానికి కూడా ప్రయత్నించారు. కానీ ఇలా చేస్తే పార్టీకి ముప్పని భావించిన వైసీపీ నాయకులు ఇప్పుడు రైతులతో చర్చలకు సిద్ధమంటూ సంకేతాలు జారీ చేస్తున్నారు. కొడాలి నాని కూడా రైతులతో చర్చలకు సిద్ధమని వెల్లడించిన విషయం తెలిసిందే. జగన్ చెప్పలేని చర్చల విషయాన్ని తన పార్టీ నాయకుల చేత చెప్పిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు .
ఈ నిర్ణయంతో ప్రతిపక్షాలకు షాక్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకవేళ నిజంగా అమరావతి రైతులతో చర్చలకు సిద్ధమైతే ప్రతిపక్షాలకు పెద్ద షాక్ తగలనుంది. ఎందుకంటే టీడీపీ నేతలు ఈ విషయంపైనే ప్రభుత్వాన్ని ప్రతిరోజు తిడుతున్నారు. అయితే ఇప్పుడు జగన్ అమరావతి రైతులతో చర్చలు జరిపి, వారి సమస్యకు పరిష్కారం చూపిస్తే జగన్ రైతుల దృష్టిలో దేవుడిలా అవుతాడు. ఇలా జరిగితే ప్రతిపక్షాల నేతలకు ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆస్కారం ఉండదు. జగన్ తీసుకోబోయే నిర్ణయంతో ప్రతిపక్షాలకు షాక్ తగలనుంది.