వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు మీద విపరీతమైన రీతిలో ఆరోపణలు చేశారు. తమకు అధికారం దక్కితే టీడీపీ నేతల అక్రమాలన్నింటినీ బయటకు లాగుతామని అన్నారు. ప్రధానంగాఅమరావతి విషయంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ఆమాత్రావతి పేరు చెప్పి రియల్ ఈస్ట్ దందా చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో వస్తుందని ముందే తన అనుచరులకు లీక్ చేశారని, ముందే టీడీపీ నేతలంతా రాజధాని చుట్టువపక్కల అభారీ ఎత్తున రైతుల నుండి భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటినే తిరిగి ప్రభుత్వానికి ఆధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. కేలవం ఒక సామాజికవర్గం ప్రయోజనాల కోసమే అమరావతి అని అన్నారు. ఈ ఆరోపణలను పెద్ద ఎత్తున ప్రచారం చేసి జనం సైతం ఆవునేమో అనుకునేలా చేశారు.
ఇన్ సైడ్ ట్రేడింగ్ గుట్టు రట్టు చేస్తామని కోర్టుకు వెళ్లారు. కానీ కోర్టు మాత్రం చంద్రబాబుకు క్లీన్ చీట్ ఇచ్చింది. భూములు కొనడం, అమ్మడం నేరమెలా అవుతుందని, అసలు ఐపీసీలో ఇన్ సైడ్ ట్రేడింగ్ కొత్త పదమని, రాజధాని పలానా ప్రాంతంలో వస్తుందని అందరికీ తెలుసు. మరి దాంట్లో రహస్యం ఏముంది. భూముల కొనుగోలు, విక్రయాలు రాజ్యాంగం ఇచ్చిన అహక్కు దాన్ని తప్పుబడితే ఎలా. కొన్న తర్వాత భూముల ధర పెరిగిందని విక్రయదారుడు కేసు పెడితే ఎలా. ఈ కేసులో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వర్తించదు. ఇందులో కుట్రలు లేవు. అన్నీ చట్టబద్దమైన ఒప్పందాలే. కాబట్టి కేసులు నిలబడవు అని తెలిపింది. దీంతో జగన్ అండ్ టీమ్ పట్టుకున్న ఇన్ సైడ్ ట్రేడింగ్ ఆరోపణలు తేలిపోయాయి. ఈ ఎపిసోడ్ మొత్తంలో ప్రభుత్వమే కోర్టుకు వెళ్లి మరీ చంద్రబాబు నిజాయితీని నిరూపించినట్టు అయింది.
ఇక పోలవరం విషయంలోనూ ఇదే జరిగింది. పోలవరాన్ని చంద్రబాబు ఒక ఏటీఎం తరహాలో వాడుకున్నారని, బాబు హయాంలో భారీ అవినీతి జరిగిందని అంటూ రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా రెండు వేల కోట్లు మిగిల్చామని, బాబు పాలనలో తట్ట మట్టి కూడా ఎత్తలేదని అన్నారు. ఏకంగా కేంద్రానికి పిర్యాదు చేశారు. కానీ కేంద్రం మాత్రం చంద్రబాబు హయాంలో పోలవరంలో ఎలాంటి అవినీతి జరగలేదని, అంతా కరెక్టుగానే ఉందని తేల్చింది. అంటే అక్కడ కూడ వైసీపీ వాదన డొల్లేనని తేలింది. ఇక ఇతర విషయాల్లో బాబు మీద అవినీతి ఆరోపణలైతే చేస్తున్నారు కానీ ఇంతవరకు ఆధారాలు, అరెస్టులు, విచారణలు లేవు. ఇలా బాబును దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో జగన్ అడుగడుగునా విఫలమవుతూనే ఉన్నారు. దీంతో టీడీపీ శ్రేణులు మా నాయకుడి నిజాయితీ ఎంత గొప్పదో సీఎం స్వయంగా నిరూపించారు అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.