జగన్ పై విషం చిమ్ముతున్న ఎల్లో మీడియా

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమి చేసినా…ఏమీ చేయకపోయినా ఎల్లోమీడియాకు తప్పులాగే కనబడుతోంది. రాజకీయపార్టీగా తెలుగుదేశంపార్టికి వైసిపితో బద్ధవైరం ఉండటంలో తప్పులేదు. మొన్నటి ఎన్నికల్లో వైసిపి చేతిలో చావుదెబ్బ తిన్న నేతగా చంద్రబాబునాయుడుకు జగన్ అంటే మండిపోవటంతో కూడా తప్పులేదు. అందుకే జగన్ చేసే ప్రతిపనిలోను తప్పులు పడుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు.

కానీ సమాజానికి నీతులు చెబుతున్నామని అనుకుంటూ, సమాజాభివృద్ధి కోసమే అక్షర యుద్ధం చేస్తున్నామని తన భుజాలు తానే చరుచుకునే తోకపత్రిక ఏది తోస్తే అది రాసేస్తోంది. చంద్రబాబు ఏది మాట్లాడితే దాన్నే మరింత డీటైల్డ్ గా తన చెత్తపలుకులో అచ్చేస్తోంది. డిప్లమాటిక్ ఔట్ రీచ్ లో జగన్ కొన్ని విషయాలు చెప్పారు. అందులో అబద్ధాలేమీ లేదు. ఆ విషయంలోనే చంద్రబాబు, లోకేష్, చెత్తపలుకు వ్యసకర్త ఆందోళన పడుతున్నారు.

అంటే వాళ్ళ ఉద్దేశ్యంలో పిపిఏల సమీక్ష విషయం చెప్పకూడదు. పోలవరం అవినీతిపై సమీక్షిస్తున్నట్లు మాట్లాడకూడదు. స్ధానికులకే 75 శాతం ఉద్యోగవకాశాలు కల్పించాలని విధానాన్ని ప్రస్తావించకూడదు. జగన్ స్పీచ్ వల్ల పరిశ్రమలు వెనక్కు వెళ్ళిపోతాయట. బందర్ పోర్టు అగ్రిమెంట్ అయి 10 ఏళ్ళయినా పనులు మొదలుపెట్టని నవయుగ కంపెనీ కాంట్రాక్టు రద్దు చేయకూడదట.

కియా కార్ల ఉత్పత్తి ప్లాంటులో 70 శాతం స్ధానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వంతోనే యాజమాన్యం అగ్రిమెంటు చేసుకుంది. తర్వాత అగ్రిమెంటును యాజమాన్యం ఉల్లంఘించినా చంద్రబాబు పట్టించుకోలేదు. 70 శాతం స్ధానికులకే ఉద్యోగాలన్న విషయం ఎన్నికల సమయంలో టిడిపి ప్రకటనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అప్పుడేమో ఓట్లకోసం తప్పుడు ప్రకటనలు చేశారు. ఇపుడు దాన్నే జగన్ నిజం చేయాలని చూస్తుంటే ఎల్లోమీడియాకు తప్పుగా కనబడుతోంది. మొత్తానికి జగన్ పై విషంచిమ్మటమే పనిగా పెట్టుకున్న విషయం అర్ధమైపోతోంది.