ప్రచారాలతో పరువు పొగొట్టుకుంటున్న చంద్రబాబు.. ఆ మీడియా పనే అంటూ?

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎల్లో మీడియా వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతోందంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు సొంత పత్రికలు లేకపోయినా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక విధంగా సొంత పత్రికలు అనే సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు పత్రికలు గత కొంతకాలంగా టీడీపీ ఎన్డీయేలో చేరనుందంటూ జోరుగా ప్రచారం చేశాయి.

అయితే ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని బీజేపీ నేతలు స్వయంగా వెల్లడించడం గమనార్హం. ఆ తర్వాత చంద్రబాబు సైతం టీడీపీ ఎన్డీయేలో చేరుతుందని జరిగిన ప్రచారంలో నిజం లేదని ఇందుకు సంబంధించి ఎవరు ప్రచారం చేశారో వాళ్లనే దీని గురించి అడగాలని చెప్పారు. అయితే ఈ ప్రచారం చేసింది ఎల్లో మీడియా కావడంతో నెటిజన్లు ఎల్లో మీడియానే ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎన్డీయేలోకి టీడీపీ అనే వార్త వైరల్ అయిన వెంటనే చంద్రబాబు రేంజ్ ఊహించని స్థాయిలో పెరిగిందనే విధంగా ఎల్లో మీడియాలో ప్రచారం జరిగింది. కానీ వాస్తవం మాత్రం మరో విధంగా ఉండటంతో ఎల్లో మీడియాకు భారీ షాక్ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెద్దగా ప్రభావం చూపని పార్టీలలో టీడీపీ ఒకటిగా ఉంది. 2024 ఎన్నికల్లో సైతం టీడీపీ నుంచి మరీ భారీ ఫలితాలను అయితే ఊహించవద్దని కామెంట్లు వినిపిస్తున్నాయి.

టీడీపీ అనుకూల ఛానెళ్లలో ఇందుకు సంబంధించి డిబేట్లు కూడా సాగాయి. అటు బీజేపీ, ఇటు టీడీపీ నుంచి క్లారిటీ రావడంతో రెండు మూడు రోజుల నుంచి జోరుగా ప్రచారం చేసిన వాళ్లు సైతం సైలెంట్ అయ్యారు. ఎల్లో మీడియా చంద్రబాబు పరువు నిలబెట్టాలని చేస్తున్న ప్రచారం వల్ల ఆయన పరువు పోవడంతో పాటు ఆయన పొలిటికల్ కెరీర్ కు కూడా నష్టం కలుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.