వివేకాను చంపింది టిడిపియే: విజయసాయి రెడ్డి

వైయస్ కుటుంబాన్ని అంతం చేయాలని తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నిందని, 1998 నుంచి ఈకుట్రను అమలుచేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తూ ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయప్రధానకార్యదర్శి  విజయసాయిరెడ్డి  తీవ్ర ఆరోపణ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య  మీద వ్యాఖ్యానిస్తూ ఆయన ఇలా అన్నారు.

1998 నుంచి వైయస్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు.  వైఎస్ తండ్రి రాజారెడ్డి హత్యలో సైతం టిడిపి ప్రమేయం ఉంది. -హంతకులకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్షణ కల్పించారు. -వైయస్ జగన్ పై ఎయిర్ పోర్ట్ లో హత్యయత్నం చేస్తే అందులో టిడిపి వారే నిందితులు,’ అని ఆయన ఆరోపించారు. వైయస్సార్ కుటుంబాన్ని అంతమొందించాలనే కుట్రలో భాగంగా వివేకానందరెడ్డి హత్య జరిగిందని ఆయన అన్నారు. ఇందులో మంత్రి ఆదినారాయణరెడ్డి,చంద్రబాబు,లోకేష్ ల పాత్ర ఉంది.హత్యా కుట్రను అమలు చేసిందని చాలా స్పష్టంగా విజయ సాయి చెప్పారు. తెలుగుదేశం పార్టీ హంతకుల పార్టీగా మారిందని అన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారో చూడండి

-పోలీసు వ్యవస్దనంతటిని గత ఐదు సంవత్సరాలులో  భ్రష్టుపట్టించారు.
-గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన ప్రతి హత్యలో కూడా టిడిపి పాత్ర ఉంది.
-చెరుకులపాడు నారాయణరెడ్డిని కూడా హత్య చేసి ఆ కేసును నీరుగార్చారు.
-రాష్ట్ర పోలీసులపై మాకు నమ్మకం లేదు కాబట్టి వైఎస్ వివేకానందరెడ్డి హత్య లో  సిబిఐ విచారణ జరిపించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.
-సిట్ విషయానికి వస్తే అది తిరిగి డిజి ఆద్వర్యంలోనే పనిచేస్తుంది.ఆ డిజిపైనే మాకు నమ్మకం లేనప్పుడు ఆ సిట్ ఏరకంగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు.

-వివేకానందరెడ్డి కి కుటుంబకలహాలు ఏమి లేవు,జమ్మలమడుగు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ గా
వివేకానంద రెడ్డి పనిచేస్తున్నారు. వైయస్సార్ కుటుంబంలో ఆయన కుటుంబపెద్ద.ఆయన ముందు దిశానిర్దేశం చేస్తా వచ్చారు. ఏనాడు ఆయన లోక్ సభకు పోటీ చేస్తానని అనలేదు.
వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే పట్టుదలతో వివేకానందరెడ్డి పనిచేస్తున్నారుని అయితే, తెలుగుదేశం ఈ హత్యను రాజకీయ ప్రచారం కోసం వాడుకోవాలనుకుంటున్నది.

-డిజిపి మార్పును ఇప్పుడే కాదు గతంలోనే మేం డిమాండ్ చేశాం.
-బిజేపికి,టిడిపికి అనుబంధం  కొనసాగుతున్నందువల్లనే డిజిపి మార్పు జరగలేదు.డిజిపి టాగూర్ చంద్రబాబు అడుగులకు మడుగులు వత్తుతున్నాడు.
-షెడ్యూల్ ప్రకటనకు ముందు కూడా డిజిపిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం.
-తెలుగుదేశం పార్టీ తెలుగుడ్రామాల పార్టీ,తెలుగుదొంగల పార్టీ ఇప్పుడు తెలుగుహంతకుల పార్టీగా మారింది.

-మాకు అందిన సమాచారం ప్రకారం.అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు .ఉదయం అందరూ కూడా గుండెపోటు అన్నారు.పోస్టు మార్టం వచ్చాక హత్య అనే భావన కలిగింది.

హత్య అని నిర్దారణ అయింది.అందుకే నిష్పాక్షిక విచారణ జరగాలని కోరుతున్నాం.
-మంత్రి ఆదినారాయణ రెడ్డి ఓ హంతకుడు.హంతకుడే ఆరోపణలు చేయడం ఏంటి? ఎన్ని మర్డర్లు చేయించారో అందరికి తెలుసు. స్వర్గీయ రాజారెడ్డిగారి హత్య ఎన్నికలకు ముందు జరిగింది.వైయస్ రాజశేఖరరెడ్డి మృతి ఎన్నికల తర్వాత నాలుగునెలలకు జరిగింది.

ఆయనకున్న ఆదరణ చూడలేక ఎలిమినేట్ చేయడం జరిగింది.నేడు వివేకానందరెడ్డిగారు ప్రజలతో మమేకం అయి పనిచేస్తారని తెలుసు.ఆయన ఉంటే అక్కడ ఆదినారాయణరెడ్డి రాజకీయమనుగడకు ప్రమాదం అని ఎలిమినేట్ చేయడం జరిగింది.ఇదంతా ఓ వ్యూహంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది.