మళ్ళీ వైసీపీదే అధికారం.! కండిషన్స్ అప్లయ్.!

ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు ఎలా వుండబోతున్నాయి.? ఈ విషయమై ఎప్పటికప్పుడు అనేక సర్వేలు జరుగుతూనే వున్నాయి. తాజాగా వెలుగు చూస్తోన్న ఓ సర్వే సారాంశమేంటంటే, ఇంకోసారి అధికారం వైసీపీదేనని.! అయితే, వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి సెంచరీ కొట్టే అవకాశమే లేదట. విపక్షాలు బలపడ్డాయన్నది తాజా సర్వేల సారాంశం. ఎంతమేర బలపడ్డాయి.? ఇంతకీ బలపడ్డ విపక్షాల్లో టీడీపీది ఏ స్థానం, జనసేనకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం వుంది.?

టీడీపీ, వైసీపీ కలిసి పోటీ చేస్తే గనుక, రెండు పార్టీలూ కలిసి 75 స్థానాలుకు పైగా సొంతం చేసుకునే అవకాశం వుందట. జనసేనకి పోటీ చేయడానికి దక్కే స్థానాల్ని బట్టి, గెలిచే స్థానాలు ఆధారపడి వుంటుందని తెలుస్తోంది. నిజానికి, జనసేన పార్టీకి నలభై స్థానాల్లో గెలిచే అవకాశం వుందట. కానీ, టీడీపీ ఆ స్థాయిలో జనసేనకు గెలిచే స్థానాల్లో అవకాశం ఇవ్వకపోవచ్చు పొత్తులో భాగంగా. ఈ నేపథ్యంలో జనసేన గట్టిగా 22 సీట్లలో మాత్రమే గెలిచే అవకాశం వుందని తెలుస్తోంది. టీడీపీ మాత్రం, యాభై ఆ పైన సీట్లు గెలవబోతోందిట. ఈ సర్వేకి సంబంధించి అధికార వైసీపీలో లోతైన చర్చ జరుగుతోంది.

ప్రస్తుతానికైతే టీడీపీ – జనసేన మధ్య కింది స్థాయిలో అస్సలు సఖ్యత లేదు. అందుకే, వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్ళడం ద్వారా లాభపడాలని వైసీపీ అనుకుంటోందని అంటున్నారు. టీడీపీ – జనసేన కలవకుండా వుంటే మాత్రం వైసీపీ 120 స్థానాల్లో గెలిచేందుకు మార్గం సుగమం అవుతుందిట.