వైసీపీ ఎంపీ సొంత ఊళ్లో టీడీపీకి ఏకగ్రీవం … !

Who won the Panchayat elections ysrcp or tdp

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు తమ సొంత ఊళ్లపై ఫోకస్ పెట్టారు. ఇటు ప్రతిపక్షం టీడీపీతో పాటూ ఇతర పార్టీల నేతలు కూడా ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ సొంత ఊరిలో పంచాయతీ టీడీపీకి ఏకగ్రీవం అయ్యింది.

tdp ycp

కర్నూలు మండలం పి. రుద్రవరంలో టీడీపీ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థి ఎంకే మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సోమవారం మధుకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ ఊరిలో 10 వార్డుల్లో 1,154 ఓటర్లున్నారు.

సర్పంచ్‌ స్థానాలకు ఐదుగురు నామినేషన్‌ దాఖలు చేయగా చివరకు నలుగురు పోటీ నుంచి తప్పుకొన్నారు.. దీంతో మధు సర్పంచ్‌ గా ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. మధు కూడా ఎంపీ గోరంట్ల మాధవ్ ‌కు బంధువు తెలుస్తోంది. ఈ గ్రామం ఏకగ్రీవానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.