ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో విజయం కోసం సంచలన నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా అస్సలు వెనక్కు తగ్గడం లేదు. ఎంతోమంది ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కొంతమంది వైసీపీ నేతలు జనసేనపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. టీడీపీలోకి వెళ్లినా ప్రయోజనం ఉండదని భావించి ఈ నేతలు జనసేనలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు.
జనసేనలో చేరడం ద్వారా ఆ పార్టీ నుంచి సులువుగా టికెట్ పొందవచ్చనే భావన చాలామంది వైసీపీ నేతలలో ఉంది. ప్రముఖ వైసీపీ నేతల సన్నిహితులు సైతం జనసేన వైపు ఆకర్షితులు అవుతుండటం గమనార్హం. వరుసగా జనసేన నేతలు వైసీపీపై దృష్టి పెట్టడం జనసేన నేతలను సైతం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వైసీపీలో ప్రాధాన్యత దక్కకపోవడం వల్లే ఇతర పార్టీలలో చేరుతున్నామని వీళ్లు చెబుతున్నారు.
జనసేనను వైసీపీ నేతలు నమ్ముకుంటున్నారంటే ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా ఆ నేతలకు అంతకు మించిన బెటర్ ఆప్షన్ లేదు. కొంతమంది నేతలు వైసీపీ వాడుకుందని ఆ తర్వాత మోసం చేసిందని మరి కొందరు నేతలలో భావన ఉంది. వైసీపీపై వ్యతిరేకత ఉన్నా కొంతమంది నేతలు మాత్రం ఆ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరచడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది.
నాయకుల కొరత ఉన్న జనసేన ఇతర పార్టీల నేతల బలంతో పుంజుకుంటుందేమో చూడాలి. జనసేన తరపున కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే టికెట్ల కేటాయింపు జరిగిందని మరికొన్ని ప్రాంతాలలో మాత్రం ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని బోగట్టా. జనసేన 2024 ఎన్నికల్లో ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. ఎన్నికల్లో జనసేనకు అనుకూల ఫలితాలు రావాలని ఆ పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు.