ఆ తప్పులే వైసీపీ కొంప ముంచాయా.. 75 సీట్లు రావడం కూడా కష్టమేనా?

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి శాపంగా మారాయా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీ చేసిన చిన్నచిన్న తప్పులే పార్టీని ముంచేశాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీకి 75 సీట్లు రావడం కూడా కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీ చేసిన తప్పులు అన్నీఇన్నీ కావని అందుకు సంబంధించిన మూల్యాన్ని ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

టీడీపీ పలు ఏరియాలలో డబ్బులు పంచకపోయినా విజయం సాధించిందని ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఇంతకు మించి సాక్ష్యం అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. గట్టిగా ప్రచారం లేకుండా టీడీపీ విజయం సాధించడం హాట్ టాపిక్ అవుతోంది. గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం చేకూరేలా జగన్ వ్యవహరించలేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వాలంటీర్ల మద్దతు, గ్రామ వార్డ్ సచివాలయ అభ్యర్థుల మద్దతు ఉన్నా వైసీపీకి ఇలాంటి విచిత్రమైన పరిస్థితి రావడం ఏంటని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు, నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవడం, ఇతర కారణాల వల్ల వైసీపీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైసీపీ సైతం జరిగిన తప్పులను గుర్తించాల్సి ఉంది.

ఈ తప్పులు పునరావృతం కాకుండా అడుగులు వేయాల్సి ఉంది. 2024 ఎన్నికలకు ఈ ఎన్నికలు సెమీ ఫైనల్స్ కాగా టీడీపీ మాత్రం ఉత్సాహంతో ఉంది. వైసీపీ చరిత్ర ముగిసినట్టేనని టీడీపీ, జనసేన కూటమిదే అధికారమని కామెంట్లు వినిపిస్తున్నాయి.