ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. వైసీపీ టీడీపీని తొక్కేసే దిశగా అడుగులు వేస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అమలు చేస్తున్న జీవో నంబర్ 1 పై ఇప్పటికే ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ జీవోతో టీడీపీ, జనసేనలకు వైసీపీ చుక్కలు చూపిస్తోంది. తాజాగా వైసీపీ గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల సహాయంతో ఈ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న వైసీపీ ప్రస్తుతం ఆ కార్యాలయానికి రంగులు పూయిస్తోంది. వైసీపీ నేతల తీరుపై సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ వెళుతున్న రూట్ రైటేనా? అంటూ సామాన్య ప్రజల నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ కార్యాలయానికి లీజు గడువు మరో 6 నెలలు ఉందని అయినప్పటికీ ఈ కార్యాలయం విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాల విషయంలో జగన్ సర్కార్ ఎందుకు జోక్యం చేసుకుంటోందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ విషయంలో వైసీపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్ల విషయంలో వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. ప్రజల నుంచి విమర్శలు రాకుండా జగన్ సర్కార్ అడుగులు వేయాల్సి ఉందని కొంతమంది సూచనలు చేస్తున్నారు.