వైసీపీ వంద రెట్లు నయం.. చంద్రబాబు ఆయనను కూడా మోసం చేశారా?

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీపై ప్రజల్లోనే కాదు ఇతర పార్టీల రాజకీయ నేతల్లో కూడా నమ్మకం పెరుగుతోంది. తాజాగా కేఏ పాల్ చంద్రబాబును విమర్శించడంతో పాటు జగన్ పై ప్రశంసల వర్షం కురిపించడంతో కేఏ పాల్ కూడా చంద్రబాబుకు దూరమైనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కొత్తగా రూల్స్ ను పెట్టడానికి చంద్రబాబు కారణమని కేఏ పాల్ పేర్కొన్నారు.

బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికే గుంటూరులో తాజాగా కార్యక్రమాన్ని నిర్వహించారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో ఉన్నవాళ్లు జీవితాలు నాశనమవుతాయని ఎస్సీ, ఎస్టీ, బీసీలు బిచ్చగాళ్లా అని కేఏ పాల్ ప్రశ్నించారు. ఏపీలో అడుగు పెట్టే హక్కు లేదని ప్రస్తుతం బీ.ఆర్.ఎస్ తరపున పని చేస్తున్న ఏపీ నేతలు కేసీఆర్ కు అమ్ముడుపోయారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ వంద రెట్లు నయం అంటూ కేఏ పాల్ కామెంట్లు చేశారు.

కేఏ పాల్ చేసిన కామెంట్లు విని చంద్రబాబు చివరకు కేఏ పాల్ ను కూడా మోసం చేశారా అని నెటిజన్లు కామెంట్లు చేశారు. చంద్రబాబు సభలలో జరిగిన దుర్ఘటనలపై హైకోర్టు విచారణ చేయనుందని కేఏ పాల్ కామెంట్లు చేశారు. కులాలను విడగొట్టిందని చంద్రబాబేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు పరువు పోయేలా కేఏ పాల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కేఏ పాల్ తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటాలని అనుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పని చేసిన కేఏ పాల్ ఇప్పుడు మాత్రం వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేఏ పాల్ కొన్ని విషయాల్లో కమెడియన్ అనిపించుకున్నా ఆయనకు కూడా అభిమానులు ఉన్నారు.