వైయస్ జగన్ ని ముఖ్యమంత్రి కాకుండా చేయాలని ఆంధ్ర రాష్ట్రంలో ప్రముఖ పత్రిక ఆంధ్రజ్యోతి తన శక్తివంచన లేకుండా కృషి చేసింది. ఎన్నికల ముందు చంద్రబాబుని కీర్తిస్తూ జగన్ దెప్పిపొడుస్తూ అనేక కథనాలు వండి వార్చింది. అయితే ఆంధ్రజ్యోతి ఆశలకు భిన్నంగా తెలుగు రాష్ట్ర ప్రజలు తమ తీర్పును జగన్ మోహన్ రెడ్డి కి అనుకూలంగా ఇచ్చారు
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఆంధ్రజ్యోతి ఇక తప్పదన్నట్టు జగన్ వార్తలు రాయడం ప్రారంభించింది. పాజిటివ్ వార్తలు రాస్తున్నట్టు కనపడుతుంది కానీ ఎక్కడో ఒకచోట తన అసలు నైజాన్ని బయట పెడుతుంది
ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రతి వారం ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని అయిన రాధాకృష్ణ తన అభిప్రాయాలని కొత్త పలుకు అనే శీర్షిక ద్వారా తెలియజేస్తూ ఉంటారు.
ఈ వారం కొత్త పలుకులో ప్రస్తుతం బిజెపి చేస్తున్న రాజకీయాల్ని ఉటంకిస్తూ బిజెపి ఆంధ్రప్రదేశ్లో తన ప్రధాన శత్రువు అయిన తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసిన తర్వాత బిజెపి తన దృష్టినిి వైసీపీ మీద పెడుతుందని చెప్పుకొచ్చారు. వైసిపి పని పట్టడం చాలా సులువు అని ఎందుకంటే జగన్మోహన్రెడ్డి మీద అనేక కేసులు ఉన్నాయి కాబట్టి అతన్ని జైలుకు పంపించేసి 2024 ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పుకొచ్చారు.
గత తొమ్మిది సంవత్సరాలుగా ఈనాడు ఆంధ్రజ్యోతి జగన్ ని జైలుకు పంపుతూనే ఉన్నారు. అఖండమైన ప్రజా తీర్పును గెలుచుకున్న వైయస్ జగన్ మీద తమ ద్వేషాన్ని చూపడంలో తెలుగుదేశం అనుకూల మీడియా కనీసం ఒక నెల కూడా ఆగలేక పోతున్నది.