వైసిపి ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్

వైసిపి ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్

జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి 45 రోజులు కావస్తోంది. అయితే జగన్ తాను ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజు నుండే తన ప్రభుత్వ పనితీరు ఎలా ఉండబోతుందో స్పష్టమైన సంకేతాలు అటు ఎమ్మెల్యేలకు అధికారులకు పంపించారు. తాను అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఎవరన్నా అవినీతి చేస్తే వారి మీద చర్యలకు ఉపేక్షించేది లేదని అవకాశం వచ్చిన ప్రతిసారీ చెబుతూ వచ్చారు.

ఈ మధ్యకాలంలో అవినీతి మీద ఇంత స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలు అనేక రకాలైన విషయాల్లో తలదూరుస్తూ ట్రాన్స్ఫర్లు దగ్గర్నుంచి చిన్న చిన్న పోస్టింగులకు డబ్బులు తీసుకుంటున్నట్టు ఇంటలిజెన్స్ వర్గాలు ముక్యమంత్రి కి తెలియజేశాయట. దీంతో జగన్ ఎమ్మెల్యేలను పిలిపించుకొని తన దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట అవినీతి మరియు పనితీరు ఈ రెండు అంశాలే రాబోయే ఎన్నికలకు టికెట్ దక్కాలంటే ప్రధానమైన కొలమానాలను వారికి సూటిగా చెప్పారట జగన్.

ఎమ్మెల్యేలు మాత్రం తాము ఖర్చుపెట్టిన అనేక కోట్లు తిరిగి ఎలా రాబట్టుకోవాలి మరియు వచ్చే ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలి అని జగన్ ని అడగలేక వారిలో వారే చర్చించుకుంటున్నారట.