ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మూడేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ప్రభుత్వం తాజాగా గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేతలకు షాక్ తగులుతోంది. ప్రజల ప్రశ్నలకు వైసీపీ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే శంకర నారాయణకు మహిళ భారీ షాకిచ్చింది. పెనుగొండ ఎమ్మెల్యే శంకర నారాయణ నియోజకవర్గంలో ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు.
గతంలో మంత్రిగా ఉన్న శంకరనారాయణ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేశాడని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రోడ్ల గురించి, నీళ్ల గురించి, పింఛన్ల గురించి నియోజకవర్గ ప్రజలు నిలదీస్తుండటంతో ఎలా స్పందించాలో ఆయనకు అర్థం కావడం కావడం లేదు. తాజాగా శంకరనారాయణ శెట్టిపల్లి, శెట్టిపల్లి తండాల్లో పర్యటించారు. అయితే శెట్టిపల్లి గ్రామానికి చెందిన లలితాబాయి అనే మహిళ వైసీపీ ఎమ్మెల్యేకు భారీ షాకిచ్చారు.
తనకు 11 నెలలుగా పింఛన్ రావడం లేదని మహిళ ఎమ్మెల్యేకు షాకిచ్చారు. ఎమ్మెల్యే నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో మహిళ ఎమ్మెల్యేను కడిగిపారేశారు. సమస్యలను చెప్పడానికి ప్రయత్నించినా మంత్రి పట్టించుకోవడం లేదని మహిళలు ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. పద్మా బాయి అనే మరో మహిళ తనకు ఇల్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఈ తరహా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
అన్ని అర్హతలు ఉన్నా పథకాల ప్రయోజనాలు అందకపోవడంతో ప్రజల నుంచి వైసీపీ నేతలకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం పథకాల కోసం భారీ మొత్తంలో కేటాయిస్తున్నా సంక్షేమం కోసం ఎక్కువ మొత్తం కేటాయించడం లేదు. ఈ విధంగా జరగడం వల్ల ప్రజల నుంచి ఎదురయ్యే ఫిర్యాదులకు ఏ విధంగా సమాధానం చెప్పాలో ఎమ్మెల్యేలకు అర్థం కావడం లేదు.