అధికారం కోసం కన్నీళ్లు.. చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్ముతారా?

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారం కోసం చేస్తున్న ప్రయత్నాలు నవ్వు తెప్పిస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి రావాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఒక్క ఛాన్స్ అంటూ కన్నీళ్లు పెట్టకుండానే తన మనస్సులోని బాధను వెల్లడిస్తున్నారు. ప్రజలను చంద్రబాబు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేశ్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన భావిస్తున్నారు.

అయితే చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మే అవకాశం ఉందా అనే ప్రశ్నకు మాత్రం కాదనే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం. 2014 ఎన్నికల్లో అనుభవం ఉన్న నేత ఏపీకి అవసరమని నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత ప్రజలను ఏ విధంగా మోసం చేశారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికారం కోసం కొత్తకొత్త కార్యక్రమాలను నిర్వహించడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు.

ఇదేం ఖర్మ పేరుతో సర్వేలు చేయడానికి సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో టీడీపీ ఎందుకు ఓడిపోయిందో పేరుతో తెలుసుకోవడానికి సర్వేలు చేస్తే కొంతమేర బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని నెటిజన్లలో చాలామంది అభిప్రాయం చేస్తున్నారు. చంద్రబాబు మారకుండా ఓట్లు అడిగినా బెనిఫిట్ ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

వైసీపీపై, వైసీపీ పథకాలపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు వైసీపీ పథకాలను కాపీ కొట్టకుండా మేనిఫెస్టోను ప్రకటించగలరా? అనే ప్రశ్నకు సైతం కాదనే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ఈ కామెంట్ల విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.