బీజేపీతో పొత్తు ఉందా? లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు పవన్?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొంతన లేకుండా చెబుతున్న మాటలు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాను సీఎం అయిన తర్వాత మొదట ఏ ఫైల్ పై సంతకం పెడతానో కూడా పవన్ చెబుతున్నారు. అయితే ఇతర పార్టీలతో జనసేన పొత్తు ఉంటుందో లేదో మాత్రం పవన్ కళ్యాణ్ క్లారిటీగా చెప్పలేకపోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఇతర పార్టీలతో పొత్తు ఉంటే పవన్ కళ్యాణ్ సొంతంగా తీసుకున్న నిర్ణయాలు అమలవుతాయని చెప్పలేం. ఇతర పార్టీలతో పొత్తు ఉందో లేదో పవన్ కళ్యాణ్ మొదట చెబితే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. జనసేన సొంతంగా ఎన్నికల్లో పోటీ చేస్తే మద్దతు ఇవ్వడానికి మెగా ఫ్యామిలీ సిద్ధంగా ఉందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చినా ఎన్నికల్లో గెలుపు తర్వాత చంద్రబాబు తాను అనుకున్నది చేస్తారే తప్ప ఇతరులకు క్రెడిట్ రావడానికి ఏ మాత్రం ఇష్టపడరు. అదే సమయంలో బీజేపీతో పొత్తు ఉందో లేదో పవన్ కళ్యాణ్ స్పష్టత ఇస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు. క్లారిటీ లేకుండా పవన్ కళ్యాణ్ ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా వృథా అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

వైసీపీ అమలు చేస్తున్న పథకాలనే జనసేన అమలు చేస్తామని చెప్పడం కరెక్ట్ కాదని కూడా మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. సొంతంగా మేనిఫెస్టోను కూడా సిద్ధం చేసుకోలేని పార్టీలు ప్రజలకు ఎలాంటి పాలన అందిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతలకు సైతం అర్థం కావడం లేదు.