చిరంజీవి ప్లాన్స్ ను రివర్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ అంగీకరిస్తారా?

ఏపీలో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్న వ్యక్తులలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరనే సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి కోరుకున్న స్థాయిలో కూడా జనసేనను అధికారంలోకి తీసుకొనిరావాలని పవన్ కళ్యాణ్ కోరుకోవడం లేదు. ఇప్పటివరకు ఆ పార్టీలో కీలక నేతలు లేరు. పవన్ సినిమా షూటింగ్ లలో ఎప్పుడు పాల్గొంటారో పొలిటికల్ కార్యక్రమాల్లో ఎప్పుడు బిజీ అవుతారో ఆ పార్టీ నేతలకే స్పష్టత రావడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో సులువుగానే అర్థమవుతుంది.

జనసేన 2014 లో ఎలాంటి తప్పటడుగు వేసిందో ఇప్పుడు కూడా అదే తప్పటడుగు వేస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రజల సంక్షేమం కంటే చంద్రబాబు సంక్షేమానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే చిరంజీవి అంగీకరిస్తారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ప్రతిసారి జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసే బదులు జనసేనను టీడీపీలో విలీనం చేస్తే బెటర్ అని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. అలా చేస్తే పవన్ కళ్యాణ్ కూడా హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక విధంగా తనను నమ్మిన ప్రజలను మోసం చేస్తున్నారని కొంతమంది చెబుతుండటం గమనార్హం.

పాలిటిక్స్ కు సంబంధించి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు సరిగ్గా లేవని చాలామంది భావిస్తున్నారు. జగన్, పవన్ కొన్నేళ్ల తేడాతో పార్టీ ఏర్పాటు చేశారని అయితే జగన్ ఊహించని స్థాయిలో రాజకీయాల్లో సక్సెస్ కాగా పవన్ కళ్యాణ్ మాత్రం ఆశించిన స్థాయిలో రాజకీయాల్లో సక్సెస్ సాధించలేకపోయారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.