వైఎస్ జగన్ పాలన కొనసాగించినప్పటి నుండి సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తూ వాటిని ప్రజలకు న్యాయంగా అందే విధంగా చేయటానికి కృషి చేస్తున్నారు. అయితే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందడం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలను భారీగా అప్పులు ఉన్నా సరే అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక పప్పు బెల్లాలు కోసం నిధులు ఖర్చు చేస్తున్నారని ప్రజలు మీద తెలియకుండానే భారం వేస్తున్నారని విపక్షాలు అంటున్నాయి.
అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఎప్పుడూ కొన్ని సంక్షేమ కార్యక్రమాల మీద ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలకు కాకుండా కొన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బలహీన వర్గాల కోసం ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నాయి.అదేవిధంగా మైనార్టీ వర్గాలకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా ఇప్పుడు నిధులు కేటాయించే అవకాశం ఉంది.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వర్గాలకు పదివేలకు పైగా ఉచితంగా డబ్బులు ఇచ్చింది. దీనివలన ఆ డబ్బులు వృధా కావడం మినహా ఉపయోగం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సహా కొన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనవసరంగా అనాలోచిత నిర్ణయాలు తీసుకుంది అనే భావన రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతుంది. ఇచ్చిన మాట కోసం ఎక్కడికైనా వెళ్ళే జగన్… అప్పులు చేసి మరీ… సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పు. కాబట్టి ఇప్పుడు కొన్ని సంక్షేమ కార్యక్రమాల మీద మాత్రమే జగన్ ఫోకస్ చేసే అవకాశాలు ఉండవచ్చు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.