30 ఏళ్లు అధికారంలో వైసీపీ.. నమ్మకం నిజం కావడం కష్టమే జగన్?

ఏపీలో మరో 30 సంవత్సరాల పాటు వైసీపీ అధికారంలో ఉండాలని జగన్ భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే జరిగేది ఇదేనని ఆయన అనుకుంటున్నారు. అయితే వాస్తవాలు ఆయన చెప్పిన విధంగానే ఉన్నాయా అనే ప్రశ్నకు మాత్రం కాదనే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం. జగన్ పథకాలను సరిగ్గానే అమలు చేస్తున్నా ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

గ్రామ సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు కూడా జగన్ పాలన విషయంలో సంతృప్తితో లేరని సమాచారం అందుతోంది. టీడీపీ, జనసేన పార్టీలు కలిసిన నేపథ్యంలో జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జగన్ సర్కార్ ప్రజల్లో తమ పార్టీపై మరింత మంచి అభిప్రాయం కలిగే దిశగా అడుగులు వేయకపోవడం పార్టీకి మైనస్ అవుతోందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

నమ్మకం నిజం కావాలంటే జగన్ మాత్రం తన వంతు కష్టపడాల్సి ఉంటుందని చెప్పవచ్చు.నష్ట నివారణ దిశగా జగన్ అడుగులు వేస్తే మాత్రమే అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. జగన్ పొలిటికల్ గా మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. జగన్ 2024 ఎన్నికల్లో గెలవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

జగన్ ను పొలిటికల్ గా అభిమానించే అభిమానుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండగా 2024 ఎన్నికల్లో 175 స్థానాలలో విజయం సాధించాలని ఆయన భావిస్తున్నారు. రాజకీయాల్లో జగన్ సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. జగన్ 2024 ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.