జగన్,పవన్ ను అమిత్ షా కలుపుతాడా ?

ఆంధ్ర ప్రదేశ్ లో  తెలుగు దేశం అధ్యక్షుడు , ముఖ్యమంత్రి చంద్ర బాబును ఎలాగైనా ఓడించి తమకు అనుకూలమైన వారికే అధికారం దక్కేలా భారతీయ జనతా పార్టీ పావులు కడుపుతున్నదట . వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి , జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఒప్పించి  ఐక్యంగా పోటీ చేయించడానికి మాస్టర్ ప్లాన్ తయారవుతుందట . ఇంతకు ముందు జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరినీ రాష్ట్ర స్థాయిలోని నాయకులు కలిపేందుకు ప్రయత్నం చేశారట . అందుకు ఇద్దరికీ దగ్గరైన ఘట్టమనేని ఆదిశేషగిరి రావు (బంగారు )చేసిన ప్రయత్నం ఫలించలేదు .  ఎవరికీ వారే స్వతంత్రంగా పోటీ చెయ్యాలనే ఆలోచనతోనే వున్నారు  కాబట్టే కలపలేక పొయ్యామని  బంగారు అన్నట్టు తెలిసింది . అయితే వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి , పవన్ కళ్యాణ్ విడివిడిగా పోటీచేయడం వల్ల తెలుగు దేశం లాభ పడుతుందని భారతీయ జనతా పార్టీ ఆందోళన పడుతుంది . అందుకే నేరుగా అమిత్ షా రంగంలోకి దిగినట్టు విశ్వసనీయ సమాచారం . 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి , జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మోడీకి విదేయులుగానే వున్నారు . ఈ ఇద్దరు కూడా చంద్ర బాబు మళ్ళీ ముఖ్య మంత్రిగా రాకూడని కోరుకుంటున్నారు . అయితే వేరు వేరుగా పోటీ చేయడం వల్ల అనుకునే  లక్ష్యం నెరవేరదని , అందుకే కలసి పోటీ చెయ్యాలని వారికి బీజేపీ సందేశం పంపినట్టు తెలిసింది . అయితే బీజేపీ ఎత్తుగడ గ్రహించిన బాబు పవన్ కళ్యాణ్ ను దువ్వుతున్నాడని , ఇటీవల తనకు ప్రాణ హాని ఉందని పవన్ ప్రకటించగానే చంద్ర బాబు స్పందించాడని, నీ ప్రాణానికి నాప్రాణం అడ్డు వేస్తానని చంద్ర బాబు అన్న మాటలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి . పవన్ ను తన దారికి తెచ్చుకుంటే తనను ఏ శక్తీ ఆపలేదని చంద్ర బాబు నమ్మకం .

ఇలాంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నాయకులు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై ద్రుష్టి సారించారు . జగన్  మోహన్ రెడ్డి , పవన్ కళ్యాణ్ భిన్న ధృవాలు .  మోడీ, అమిత్ షా సలహా విని వీరు కలసి పోటీచేస్తారా ? ఎవరికీ వారే తమకు ఎంతో శక్తి ఉందనుకుంటారా ? చంద్ర బాబు వ్యూహం ఫలిస్తుందా ? మోడీ , షా విజయం సాధిస్తారా ?