జనాలు మరీ ఇంత వెర్రివాళ్ళలా కనిపిస్తున్నారా కేసీఆర్ సారుకి ?

Why TRS supporting BJP 
కేసీఆర్ రాజకీయం ఇంతకుముందు ముక్కుసూటిగా ఉండేది.  స్పష్టమైన ఎజెండాతో వెళ్లేవారు.  తమకు మిత్రులెవరు, శత్రువులెవరు అనే విషయాల్లో  ప్రజలతో క్లారిటీగా ఉండేవారు.  కానీ ఇప్పుడు అదే స్పష్టత లోపించింది ఆయనలో.  బీజేపీ విషయంలో రెండు నాల్కల ధోరణిలో ఉన్నారు.  రాష్ట్రంలో ఆ పార్టీని బద్ద శత్రువుగా చూస్తూనే కేంద్రంలో చెలిమి చేయడానికి రెడీ అవుతున్నట్టు కనిపిస్తున్నారు.  ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నా వారి తరపున ఒక్క మాట కూడ మాట్లాడటంలేదు.  వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా త్వరలో జరగనున్న మోడీ ప్రసంగాన్ని బహిష్కరిస్తునట్టు బీజేపీయేతర పార్టీలన్నీ తేల్చి  చెప్పాయి.  వీటిలో సుమారు 18 ప్రతిపక్ష పార్టీలున్నాయి.  వాటిలో తెరాస మాత్రం లేదు.  
 
Why TRS supporting BJP 
Why TRS supporting BJP
ఎందుకు లేదు అంటే ఇప్పుడు మోడీని వ్యతిరేకిస్తే ఢిల్లీలో జరిగిన హింసను  వెనకేసుకొచ్చినట్టే అవుతుందని అంటున్నారు తెరాస నాయకులు.  కానీ ఇక్కడ జరగనున్న నిరసన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.  మరి ఆ చట్టాలను తెరాస నాయకులు కూడ వ్యతిరేకిస్తున్నారా అంటే ఆన్సర్ లేదు.  గతంలో గ్రేటర్ ఎన్నికల సమయంలో బీజేపీ విధానాలను తెరాస తీవ్రంగా తప్పుబట్టింది.  రైతుల మోటార్లకు మీటర్లు బిగించే ప్రసక్తే లేదని చెప్పింది.  మీటర్లు బిగిస్తామన్న పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్ మీద వ్యంగ్యాస్త్రాలు వేశారు.  కేటీఆర్ సహా మంత్రులు రోడెక్కి జాతీయ బంద్ కు మద్దతు తెలిపారు.  ఇప్పటికీ రాష్ట్రంలో తమ ప్రత్యర్థి బీజేపీయే అంటారు తెరాస లీడర్లు.  మరి కేంద్రంలో దోస్తీ ఎందుకు అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని తెలివిగా చెబుతున్నారు. 
 
అలాంటప్పుడు ఇంతవరకు కేంద్రం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ  హోదా, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టులు  లాంటివి ప్రయోజనాలకు ఎందుకు చేకూర్చలేదో చెప్పలేదు.  ఇప్పుడు మద్దతిస్తే భవిష్యత్తులో ఏమైనా ఇస్తారా అంటే ఆ గ్యారెంటీ కూడ లేదు.  ఇలా అధికార పార్టీ చెబుతున్న ఏ ప్రయోజనమూ కూడ కేంద్రం నుండి వచ్చే సూచనలు కనిపించట్లేదు.  అయినా ద్వంద కేసీఆర్ ఢిల్లీలో తలొగ్గుతున్నారు.  రేపు ఉపఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు వస్తే బీజేపీ మీదనే విమర్శలు గుప్పిస్తారు.  ఈ తరహా వైఖరి జనాన్ని మభ్యపెట్టడమే తప్ప మరొకరి కానేకాదు.