చంద్రబాబు యాగీ చేస్తున్నది అందుకేనా ?

చంద్రబాబునాయుడుకైనా తెలుగుదేశంపార్టీ నేతలకైనా చిన్న విషయంలో కూడా పెద్దగా యాగీ చేయటం బాగా అలవాటే. వాళ్ళు ఎంత చిన్న విషయాన్నైనా బూతద్దంలో చూపించి పెద్దదిగా యాగీ చేయగలరు. ఎందుకంటే తెలుగు మీడియాలో సుమారు 90 శాతం దన్ను చంద్రబబుకుంది కాబట్టే.  ఇపుడు కూడా అదే జరుగుతోంది.

ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత హఠాత్తుగా చంద్రబాబు తన భద్రత విషయంలో ఆందోళణ లేవదీశారు. చంద్రబాబు భద్రతకు వచ్చిన ఢోకా ఏమీ లేకపోయినా చంద్రబాబు ఎందుకింతగా యాగీ మొదలుపెట్టారు ? ఎందుకంటే కరకట్ట మీద లింగమనేని గెస్ట్ హౌస్ అనే  అక్రమనిర్మాణంలో చంద్రబాబు ఉంటున్న విషయం వివాదాస్పదమైంది కాబట్టి.

అక్రమనిర్మాణంలో ఉండటంతో పాటు చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని జగన్మోహన్ రెడ్డి తవ్వి తీసే ప్రయత్నాల నుండి జనాల దృష్టిని మళ్ళించేందుకే. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి కంపు. ఆ విషయాన్ని తన మీడియా బలంతో చంద్రబాబు బయటపడకుండా చూసుకున్నారు. ఇపుడివన్నీ బయపటడుతోందన్న టెన్షన్ తోనే గోల మొదలుపెట్టారు.

జడ్ ప్లస్ క్యాటగిరి భద్రతలో ఉన్న చంద్రబాబుకు తామేమీ భద్రత కుదించలేదని ప్రభుత్వం హై కోర్టుకు స్పష్టం చేసింది. చంద్రబాబుకు 58 మందితో భద్రత కల్పించాల్సుంటే తమ ప్రభుత్వం 74 మందిని కేటాయించినట్లు హో మంత్రి సుచరిత స్పష్టం చేసింది. హోం శాఖ ఇదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పిన తర్వాతే చంద్రబాబు యాగీ తగ్గింది.