ఆ తెలంగాణా ఆఫీసర్ కోసం ఎదురుచూస్తున్న చంద్రబాబు

  (తెలుగు రాజ్యం ఎక్స్లూజివ్ )

 

ఆంధ్రప్రదేశ్ ఐఎ ఎస్ అధికారులలో చిన్న కలకలం మొదలయింది. ఏ ఇద్దరు అధికారులు కలసినా ఇదే గుస గుస. ఇది అన్యాయం అనే అసంతృప్తి అందరిలో వచ్చింది.   ఇంతకీవిషయం ఏమిటంటే… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక తెలంగాణ క్యాడర్ అధికారి కోసం ఎదురుచూస్తున్నారు.  ఆయన రావాలి,  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సేవ చేయాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో (సిఎంవొ) జరిగిన కుట్ర అంటున్నారు. ఫలితంగా సర్వీస్ లో ఉన్న అధికారులేకాదు, రిటైరయిన ఐఎఎస్ ఐపిఎస్అధికారులు కూడా   అసంతృప్తి తో ఉన్నారు.

ఆ అధికారి ఎవరో కాదు, ఎకె జైన్.  1983 బ్యాచ్ ఇండియన్ ఫారెస్టు సర్వీస్ అధికారి. విభజన తర్వాత ఆయన  తెలంగాణ క్యాడర్ కు వెళ్లారు. ఇపుడాయన న్యూఢిల్లీలోని నీతిఆయోగ్ లో సలహాదారుగా ఉంటున్నారు. ఆయన వచ్చే ఏడాది మార్చిలో  రిటైరవుతున్నారు. అయితే, ముందే ఆయనతో రిటైర్ చేయించి, ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫర్మేషన్ కమిషన్  (ఆర్ టి ఐ) చీఫ్ ఇన్ ఫర్మేషన్ ఆఫీసర్ నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్త బయటకు పొక్కింది. అందుకే అలజడి. ఎకె జైన్ కు తలుపులు తెరిచేందుకు తొందర్లో రెండోదఫా ఈ పోస్టు కోసం నోటిఫికేషన్ రాబోతున్నది.

మొన్నామధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు ఇన్ ఫర్మేషన్ కమిషనర్లను నియమించింది. ఇందులో ఒకరు రిటైరయిన ఫారెస్టు సర్వీస్ అధికారి,మరొక రిటైరయిన పోలీసు సర్వీసు అధికారి. మూడో వ్యక్తి కడపకు చెందిన లాయర్. ఛీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ పదవిని మాత్రం భర్తీ చేయలేదు. కారణం, ఆపోస్టును ఎకె జైన్ ఇవ్వాలనుకున్నారు. ఆయన దరఖాస్తు చేయలేదు కాబట్టి నియమాకం నిలిపేశారు.

ఇన్ఫర్మేషన్ కమిషన్ నియమకాలు

తెలంగాణవిడిపోయాక ఆంధ్రప్రదేశ్  ఇన్ ఫర్మేషన్ కమిషన్ కు ఏర్పాటుకోసం 2017 ఆగస్టు లో నోటిఫికేషన్ వచ్చింది.  అయితే, రాష్ట్రంలో ఇన్ ఫర్మేషన్ కమిషనర్లను నియమించాలన్న ఉద్దేశం చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి లేదు. కోర్టు జోక్య ంచేసుకుని నియమించి తీరాాల్సిందే నని హుకుం జారీచేయడంతో   2017 అక్టోబర్ లో ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ , ముగ్గురు ఇన్ ఫర్మేషన్ కమిషనర్ల పోసులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు.దీనికి భారీగా స్పందన వచ్చింది. రాష్ట్రంలో ఇపుడు రిటైరయిన ఐఎఎస్ , ఐఎఫ్ ఎస్, ఐపిఎప్ లతో పాటు పలువురు జిల్లా జడ్జీలు, క్యాట్ సభ్యులు, ఒకరిద్దరు కేంద్ర సర్వీసులో సెక్రటెరీగా రిటైరయినవారు…దాదాపు 300 మంది దరఖాస్తు చేశారు. ఆందులో 18 మంది చీఫ్ ఇన్మఫర్మేషన్ కమిషనర్ పోస్టుకు ధరఖాస్తు చేశారు.  కోర్టు డెడ్ లైన్ విధించడంతో నియామకాలు జరపాల్సి న తప్పనిసరి పరిస్థితి వచ్చింది.  నియామకాలకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలతో ఒక కమిటీ వుంది. ఈ కమిటి రెండు సార్లు సమావేశమయింది. అయితే, జగన్ రాలేదు. దీనితో ప్రభుత్వసభ్యులే ముగ్గురు కమిషనర్ల నియామకం పూర్తి చేసింది. చీఫ్ కమిషనర్ ఎంపిక జరగలేదు.

ఎకె జైన్ ప్రత్యేకత ఏమిటి?

ఎకె జైన్ నీతిఆయోగ్ జాయింట్ సెక్రెటరీ హోదా లో పనిచేస్తున్నారు. అక్కడ యుటిలైజేషన్ సర్టిఫికేట్లు, పోలవరం ప్రాజక్టు వంటి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమయిన విషయాలను పర్యవేక్షిస్తుంటారు. ఈ మధ్య అంత్యంత కీలకమయిన సమాచారం ఆయన రాష్ట్రానికి చేరవేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీమీద జరుపుతున్న  పోరాటానికి బాాాగా సహకరించారని చెబుతారు. రాష్ట్రం పంపించిన యుటిలైజేషన్ సర్టిఫికేట్లను పక్కన పడేయడం, పోలవరానికినిధులు విడుదల చేసినట్లే చేసి వెనక్కు తీసుకోవడం వంటి నిర్ణయాల గురించి రాష్ట్ర  ప్రభుత్వానికి   అందడంలో జైన్ కీలక ప్రాత పోషించాడని ఐఎఎస్ ఆఫీసర్ల మధ్య ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇలా సహకరించినందుకు ఎకె జైన్ ను తగురీతిలో గౌరవించాలని సిఎంవొలోని కీలకాధికారి ఒకరు ముఖ్యమంత్రిని ఒప్పించారు. అంతేకాదు, జైన్ లాంటి వ్యక్తి ఇన్ పర్మేషన్ కమిషన్ లో కూర్చోవడం అవసరమని కూడా ఒప్పించారు. బాస్ ఒప్పుకోవడం కూడా జరిగింది. ఇపుడు ఆయన కోసం ప్రత్యేకంగా చీఫ్ కమిషనర్ పదవికోసం నోటిఫికేషన్ జారీ చేందుకు రంగం సిద్ధమయింది.

ఇదే ఐఎఎస్ లకు నచ్చడంలేదు

ఇండియన్ ఫారెస్టు సర్వీస్ అధికారిని ఇన్ ఫర్మేషన్ కమిషన్ చీఫ్ నియమించాలనుకోవడం పట్ల ఐఎఎస్ లలో అసంతృప్తి రాజుకుంది. దీనికి రెండు కారణలున్నాయని సీనియర్ అధికారి ఒకరు ‘తెలుగు రాజ్యం’ కు చెప్పారు. ‘ ఇపుడు నియమించిన ముగ్గురు ఇన్ ఫర్మేషన్ కమిషనర్లలో ఒకరు పారెస్టు సర్వీస్ కు చెందిన అధికారి ఉన్నారు. ఇపుడు చీఫ్ గా కూడా మరొక ఫారెస్టు సర్వీసు అధికారిని తీసుకుస్తే కమిషన్ ఐఎఫ్ ఎస్ వాళ్ల బ్యూరో అయిపోతుంది. ఇది ఇతర సర్వీసుల వారిని అవమాన పర్చడమే. రెండో కారణం, ఎకె జైెయిన్  తెలంగాణ క్యాడర్ అధికారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే ఒక కీలకమయిన పదవికి, ఇక్కడ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులే కాకుండా ఎందరో అర్హత కలిగిన ఇతరులెందరో ఉన్నారు. తెలంగాణ అధికారిని నియమించడానికి అభ్యంతరం వ్యక్తమవుతూ ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయంలోని  సీనియర్ అధికారి  చేస్తున్న నిర్వాకం ఇదంతా,’ అని మాజీ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ట్రాన్ఫరెన్సీ ఏమవుతుంది?

ఆర్టీఐ చట్టం ప్రకారం ఏర్పాటయిన ఒక రాజ్యాంగ సంస్థ ఇన్ ఫర్మేషన్ కమిషన్. ఇది పాలనా యంత్రాంగంలో పారదర్శకత తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన సంస్కరణ ఫలితం. ఇలాంటి సంస్థలో నియామకాలు ఏ మాత్రం పారదర్శకంగా లేకపోవడమే కాకుండా అనుమానాలకు తావిచ్చే లా ఉంది. ఇలాంటి నియామకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషన్  సిఎంవొ బ్రాంచాఫీసు గా కొనసాగుతుంది తప్ప ఉన్నతమయిన సంస్థ గా ఉండలేదని ఇద్దరు ముగ్గురు ఐఎఎస్ అధికారులు వ్యాఖ్యానించారు.