‘పిన్ని’ని ఎవరు చంపారు.? టీడీపీ అను’కుల’ మీడియా మౌనమెందుకు.?

Who Killed Pinni

పక్కింట్లో పంచాయితీ అంటే, చెవులు పెద్దవి చేసుకుని, కళ్ళను చారడంత చేసేసుకుని.. వినేసి, చూసెయ్యడం.! తమ ఇంట్లో ఏం జరిగినా, చడీ చప్పుడూ లేకుండా వుండడం.! ఇదీ లోకం పోకడ.! టీడీపీ అను’కుల’ మీడియా ఈ విషయంలో మరీనూ.!

వైఎస్ వివేకానందరెడ్డి 2019 ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. తొలుత దాన్ని గుండె పోటుగా ప్రచారం చేశారు. ఆ తర్వాత అది హత్య అని తేలింది. వైసీపీ అనుకూల మీడియా మాత్రమే కాదు, టీడీపీ అనుకూల మీడియా కూడా గుండె పోటు అనే రిపోర్ట్ చేసింది తొలుత. కానీ, ఆ తర్వాతే అసలు రచ్చ మొదలైంది.

అప్పటినుంచి ఇప్పటిదాకా వైఎస్ వివేకానందరెడ్డి డెత్ మిస్టరీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అను’కుల’ మీడియా చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. చంద్రబాబు హయాంలో జరిగిన ఈ హత్యకి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బాధ్యులుగా చూపించే ప్రయత్నం అప్పట్లో జరిగింది. ఏళ్ళు గడుస్తున్నా ఆ కేసు ఇంతవరకూ కొలిక్కి రాలేదు. సమీప భవిష్యత్తులో దోషులెవరో తేలుతుందన్న నమ్మకం లేదు.

ఇక, ఇప్పుడు.. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి సోదరి కంఠమనేని ఉమామహేశ్వరి హైద్రాబాద్‌లోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కి ఉరేసుకుని చనిపోయారు. ఆమె తనంతట తానుగా ఉరివేసుకున్నారా.? ఉరికి ఎవరైనా ప్రేరేపించారా.? లేదంటే, చంపేసి వేలాడదీశారా.? అనే ప్రశ్నల్ని వైసీపీ లేవనెత్తుతోంది.

వివేకానందరెడ్డి విషయంలో టీడీపీ అనేక అనుమానాల్ని లేవనెత్తినప్పుడు, వైసీపీ ఎందుకు ఉమామహేశ్వరి విషయంలో అనుమానాలు లేవనెత్తదు. అప్పట్లో డిబేట్లు పెట్టిన టీడీపీ అను’కుల’ మీడియా ఇప్పుడు మౌనం దాల్చడం వెనుక కారణమేంటి.?

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయాల్లో వుండేవారు.. ఉమామహేశ్వరికి రాజకీయాలతో సంబంధమేంటి.? అనడానికి వీల్లేదు. ఎందుకంటే, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి స్వయానా సోదరి ఆమె. చంద్రబాబుకి స్వయానా మరదలు. చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌కి పిన్ని. స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమార్తె. సో, ఖచ్చితంగా డిబేట్లు జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే.