ఉమామహేశ్వరి పోస్ట్ మార్టం నివేదిక ఇచ్చిన ఉస్మానియా వైద్యులు?

ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె కంటమనేని ఉమామహేశ్వరి సోమవారం ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఈమె మరణించడంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు.ఈమె మరణ వార్తను తెలుసుకున్న నందమూరి కుటుంబ సభ్యులు హుటాహుటిన తన ఇంటికి చేరుకున్నారు. ఈమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలకు దారితీసింది.అయితే ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో అధిక మానసిక ఒత్తిడికి గురై ఇలాంటి నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఇకపోతే ఈమె ఆత్మహత్య చేసుకోవడంతో ఈమె మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇలా పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఈమె అంత్యక్రియలను బుధవారం మహాప్రస్థానంలో నిర్వహించారు. తాజాగా ఈమె పోస్టుమార్టం నివేదికను ఉస్మానియా వైద్యులు జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. అయితే పోస్టుమార్టం నివేదికల ప్రకారం ఈమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు.

ఉరి వేసుకున్న సమయంలో స్వర పేటిక విరిగిపోయిందని తద్వారా తాను మృతి చెందిందని పోస్ట్ మార్టం రిపోర్టులో పేర్కొన్నారు. ఇక ఈమె అంత్యక్రియలకు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు నారా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే అయితే ఎన్టీఆర్ మాత్రం ఈమె అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు.ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి హాలిడే వెకేషన్ కోసం లండన్ వెళ్లారు. లండన్ లో ఉన్న ఈయన తన అత్తయ్య మరణ వార్త తెలియగానే హుటాహుటిన ఇండియా బయలుదేరారు అయితే ఈయన ఇండియా వచ్చేసరికి తన అత్తయ్య అంతక్రియలు పూర్తి అయ్యాయి.ఇండియా వచ్చిన వెంటనే తన అత్తయ్య కుటుంబ సభ్యులను ఎన్టీఆర్ అతని కుటుంబ సభ్యులు పరామర్శించారు.