ఉమామహేశ్వరి ఆత్మ హత్య వెనుక నారా లోకేష్.?

Umamaheshwari

కంఠమనేని ఉమామహేశ్వరి (స్వర్గీయ నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె) బలవన్మరణానికి పాల్పడటం వెనుక అసలు కారణం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్.. అంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్సార్సీపీ నేత గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ మేరకు ఓ పెద్ద కథను పోస్ట్ చేశారు.

హూ కిల్డ్ పిన్ని.. అంటూ దేవేంద్ర రెడ్డి రాసిన సోషల్ మీడియా కథలో, ఉమామహేశ్వరి రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడం దగ్గర్నుంచి, హెరిటేజ్‌లో ఆమె పెట్టిన 500 కోట్ల పెట్టుబడులదాకా చాలా విషయాలున్నాయి. మొదటి భర్త వేధింపులు భరించలేక ఆయన నుంచి విడిపోయిన ఉమామహేశ్వరి, రెండో పెళ్ళి చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే.

కాగా, రెండో భర్తతో కలిసి ఉమామహేశ్వరి, హెరిటేజ్ సంస్థలో 500 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టారట. అయితే, హెరిటేజ్ సంస్థని ఫ్యూచర్ గ్రూప్‌కి విక్రయించేయడంతో.. లావాదేవీల వ్యవహారంలో ఉమామహేశ్వరికి అన్యాయం చేశారట చంద్రబాబు. ఆ విషయమై తగాదాలు నడుస్తున్నాయనీ, నష్టపరిహారం కింద, కోట్ల విలువ చేసే భూమిని ఇస్తామని చంద్రబాబు, ఉమామహేశ్వరికి చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారనీ దేవేంద్ర రెడ్డి తన స్టోరీలో రాసుకున్నారు.

ఈ భూమి విషయమై కొద్ది కాలంగా ఉమామహేశ్వరి కుటుంబానికీ, చంద్రబాబు కుటుంబానికీ మధ్య గొడవలు జరుగుతున్నాయనీ, అవి ముదిరి పాకాన పడ్డంతో చంద్రబాబు, నారా లోకేష్ సంయమనం కోల్పోయి, ఉమామహేశ్వరిపై హద్దులు దాటి తిట్ల దండకం అందుకున్నారట.

ఊహించని ఈ పరిణామంతో హతాశురాలైన ఉమామహేశ్వరి, తనకు జరిగిన అవమానం తట్టుకోలేకపోయారనీ, మరీ ముఖ్యంగా వయసులో చాలా చిన్నవాడైన లోకేష్, పిన్ని అని కూడా చూడకుండా తన మీద బూతులతో విరుచుకుపడ్డంతో ఆమె భరించలేక ఆత్మహత్య చేసుకున్నారన్నది దేవంద్ర రెడ్డి ఆరోపణగా కనిపిస్తోంది.

ఇంతకీ, ఈ కథనంలో వాస్తవమెంత.? అధికారం తమ చేతిలోనే వుంది గనుక, తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి అయినా, ఉమామహేశ్వరి ఆత్మహత్య కేసులో నిజాల్ని నిగ్గు తేల్చేందుకు వైసీపీ ఏమైనా ప్రయత్నిస్తుందేమో వేచి చూడాలి.