ఆంధ్రప్రదే లో ఓపైవు పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సమయంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం దుమారం రేపుతోంది. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అనే నినాదం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. వైజాగ్ స్టీల్ ను ప్రైవేటీకరణ చేయవద్దంటూ అధికార వైఎస్ఆర్సీపీతో పాటు టీడీపీ, వామపక్షాలు గళమెత్తాయి.

స్టీల్ ప్లాంట్ విషయంలో అందరికంటే ఎక్కువగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనే ఒత్తిడి పడింది. దీనికి కారణం గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక నుంచి పోటీ చేయడమే. విశాఖ స్టీల్ ప్లాంట్ గాజువాక నియోజకవర్గ పరిధిలోనే ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ పవన్ కల్యాణ్ కు 57వేల ఓట్లు వచ్చాయి. ఒక విధంగా తన సొంత నియోజకవర్గమైన గాజువాకలో ఇంతపెద్ద సమస్య వస్తే అందరికంటే ముందు స్పందించాల్సింది పవన్ కల్యాణే. స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్షమంది ఆధారపడి ఉన్నారు.బీజేపీతో పొత్తు కారణంగా పవన్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.