పవన్ ఫ్యాన్స్ పార్టీకి ఎందుకు ఓటేయలేదు.. ఆ ప్రశ్నలకు అసలు జవాబిదే!

954966-pawan-kalyan

రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ కు కోటి కంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. 2019 ఎన్నికలలో జనసేన పార్టీ సొంతంగా పోటీ చేయగా కనీసం 20 నుంచి 30 స్థానాలలో జనసేన గెలుస్తుందని ఫ్యాన్స్ భావించారు. అయితే అందుకు భిన్నంగా జనసేన పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. జనసేనకు 7 శాతం ఓట్లు వచ్చాయని పవన్ చెప్పుకున్నా నోటాకు కూడా దాదాపుగా అదే స్థాయిలో ఫలితాలు వచ్చాయి.

అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానించే అభిమానులు ఓటేసినా పవన్ పార్టీ ఓట్ పర్సంటేజ్ సులువుగా 20 శాతం ఉండేది. అయితే పవన్ విధివిధానాలు నచ్చకపోవడం వల్లే ఆయన అభిమానులు సైతం ఓటు వేయలేదు. 2014 సంవత్సరంలో టీడీపీకి మద్దతు ఇచ్చిన పవ టీడీపీ తీరు నచ్చకపోవడం వల్ల 2019 ఎన్నికల సమయంలో సొంతంగా పోటీ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

బీఎస్పీ ఇతర చిన్నాచితకా పార్టీలతో జనసేన పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీలు ఏపీలో ప్రభావం చూపే స్థాయిలో అయితే లేదని 2019 ఎన్నికల ఫలితాలు ప్రూవ్ చేశాయి. పవన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఫెయిల్ కావడంతో పాటు చంద్రబాబు గెలుపునే తన గెలుపుగా భావించడం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ పై పదేపదే విమర్శలు చేయడం కూడా పవన్ కళ్యాణ్ కు మైనస్ అవుతోంది.

పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి రాజకీయాలు చేసినా అంతోఇంతో ఫలితం ఉండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సరైన సమయంలో షూటింగ్ లో పాల్గొనక నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తనకు ఓటేయకపోవడం గురించి అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.