ఏపీలో అమలవుతున్న పథకాలు జగన్ ను ముంచుతాయా? తేల్చుతాయా?

jagan (1)

2019 ఎన్నికల సమయానికి టీడీపీపై ప్రజల్లో ఊహించని స్థాయిలో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత వల్లే వైసీపీకి కనీవిని ఎరుగని మెజారిటీ సొంతమైంది. టీడీపీపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో వైసీపీ సఫలమైంది. జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా వ్యవహరించడం కూడా ఆ పార్టీకి ప్లస్ అయింది. అయితే 2019 ఎన్నికల్లో ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా వైసీపీదే విజయం అని అయితే సీట్లలో తేడా ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

అయితే ఏపీలో అమలవుతున్న పథకాలు జగన్ ను ముంచుతాయో తేల్చుతాయో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలలో మెజారిటీ పథకాలు కొంతమందికి అందడం లేదు. ఏపీ ప్రభుత్వంపై పథకాలు అందని వాళ్లలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం ఏమీ చేయడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ధరలు తగ్గించే దిశగా కూడా జగన్ సర్కార్ అడుగులు వేయకపోవడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ కార్యకర్తల్లో కూడా పార్టీపై తీవ్రస్థాయిలో అసంతృప్తి ఉంది. కార్యకర్తలకు బెనిఫిట్ కలిగే విధంగా వైసీపీ వ్యవహరించలేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. జగన్ సర్కార్ ఏపీ పథకాలనే పూర్తిస్థాయిలో నమ్ముకున్నారు.

జగన్ సర్కార్ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో కూడా జగన్ సర్కార్ మళ్లీ అధికారంలోకి వస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది. జగన్ సర్కార్ 2024లో కూడా అధికారంలోకి వస్తే భారీ స్థాయిలో ఉద్యోగల భర్తీ చేయనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.