అవినాష్ రెడ్డికి నోటీసులు.. వివేకా హత్య కేసులో దోషి దొరికినట్టేనా?

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబిఐ నోటీసులు జారీ చేయడం గురించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటినుంచి అవినాష్ రెడ్డి పేరు వినిపిస్తోంది. సీబీఐ అధికారులు ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి సూచించగా ఆయన మాత్రం మరో ఐదు రోజుల వరకు విచారణకు హాజరు కాలేనని ఆ తర్వాత మాత్రం ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే ఏపీ ప్రజలు మాత్రం వివేకా హత్య కేసులో దోషి అవినాష్ రెడ్డి అని భావిస్తున్నారు. గతంలో ఈ కేసులో సాక్షులు చెప్పిన మాటల ఆధారంగా ఈ కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. వివేకానందరెడ్డి హత్య కేసు తెలంగాణకు బదిలీ కాగా సీబీఐ అధికారులు ఈ కేసులో వేగంగా విచారణ జరపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అవినాష్ రెడ్డి విచారణలో చెప్పే మాటలు ఈ కేసులో కీలకం కానున్నాయి

అవినాష్ రెడ్డి ఈ కేసులో దోషి అని ప్రూవ్ అయితే మాత్రం జగన్ సర్కార్ కు కూడా ఒకింత ఇబ్బందులు తప్పవు. టీడీపీ, జనసేన జగన్ టార్గెట్ గా వివేకా కేసులో విమర్శలు చేసే అవకాశాలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో వివేకానందరెడ్డి హత్య కేసు సంచలనం అయిన సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డి నోరు విప్పితే ఈ కేసులో మరిన్ని కొత్త పేర్లు కూడా వెలుగులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని ట్విస్టులు చోటు చేసుకునే అవకాశాలు అయ్తితే ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే మాత్రం ఎన్నికల ముందు వైసీపీకి కొత్త ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పవచ్చు. సీఎం జగన్ ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకుంటారో చూడాల్సి ఉంది. ప్రభుత్వంపై చెడ్డ పేరు రాకుండా జగన్ సర్కార్ అడుగులు వేయాల్సి ఉంది.