టిడిపి గురించి జగన్ చెప్పింది కరెక్టే

కుక్కతోక వంకరే అని చంద్రబాబునాయుడు, టిడిపి ఎంఎల్ఏలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చెప్పిం నిజమే అని వాళ్ళే నిరూపించుకున్నారు. గోల చేసినందుకు సభ నుండ సస్పెండ్ అయిన తర్వాత కారణం లేకుండానే తమను సస్పెండ్ చేశారని వాదన పెట్టుకున్నారు. గోల చేసేది వాళ్ళే అకారణంగా తమను సస్పెండ్ చేశారని వాదించేదీ వాళ్ళే. అందుకే వీళ్ళను ఉద్దేశించి జగన్ చెప్పిన కుక్కతోక వంకరే అనే సామెత నిజమే అన్నట్లుంది.

అసెంబ్లీలో గోల చేసినన్ని రోజులు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ చెప్పినా వినలేదు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన చెప్పినా మారలేదు. చివరకు స్పీకర్ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. పైగా ఎదురుతిరిగి స్పీకర్ తోనే వాగ్వాదం పెట్టుకున్నారు. చివరకు చేసేది లేక ఈ రోజు యాక్టింగ్ స్పీకర్ కోన రఘుపతి టిడిపి ఎంఎల్ఏలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడును సస్పెండ్ చేశారు.

ఎప్పుడైతే ముగ్గురు సభ్యులను స్పీకర్ సస్పెడ్ చేశారో  వెంటనే మిగిలిన ఎంఎల్ఏలు స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. తమ తప్పు లేకపోయినా తమను సస్పెండ్ చేయటం అన్యాయమంటూ వాదనకు దిగారు. ఎంతసేపు తాము ఏ తప్పు చేయలేదని వాదిస్తున్నారే కానీ సభ సజావుగా సాగకుండా అడ్డుకుంటున్న విషయాన్ని మాత్రం ఒప్పుకోవటం లేదు.

టిడిపి సభ్యులు అసెంబ్లీకి  వస్తున్నదే సభలో గోల చేయాలని. ఉన్నది 23 మందే అయినా గోల చేయటంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒకే ప్రశ్నను పదే పదే తిప్పి తిప్పి వేయటం, ఒక సభ్యుడు మాట్లాడిన అంశాన్ని మళ్ళీ మరో సభ్యుడు లేవనెత్తటం లాంటి చీప్ ట్రిక్స్ అనుసరించటంలో టిడిపి ఆరితేరిపోయింది.  ఇదే విషయమై అధికారపార్టీ ఎన్నిసార్లు అభ్యంతరం పెట్టినా టిడిపి తన పద్దతి మార్చుకోవటం లేదు. అందుకే కుక్కతోక వంకర అని జగన్ అంటున్నది.